Breaking News

కేసీఆర్ కొత్త ఇంటికి చాలా విశేషాలు..

kcrrr

వాస్తు, ఇంటి జాగాల నమ్మకాలను బాగా నమ్మే కేసీఆర్ అనుకున్నట్టే చేస్తున్నారు.. ఎప్పుడో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సకల హంగులతో నిర్మించిన ఇంటిని వదిలేస్తున్నారు.. వైఎస్ హయాంలో కట్టించిన అత్యాధునిక బేగంపేటలోని అధికారిక నివాసాన్ని సీఎం కేసీఆర్ ఖాళీ చేయబోతున్నారు.. కేసీఆర్ కోసం పక్కా వాస్తుతో నూతన భవనం నిర్మించేందుకు ఫుల్ సెక్యూరిటీ ఉన్న స్థలాన్ని సంవత్సరన్నరగా వెతుకుతున్న ఆర్ అండ్ బీ అధికారులు చివరకు ఐఎఎస్ ల అసోసియేషన్ నివాసాల్లోని 9 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. అక్కడే ఉన్న రెండు ఐఏఎస్ ల ఇళ్లను కూల్చివేసి దాదాపు 9 ఎకరాల్లో సీఎం కోసం సకల హంగులు, ఆర్భాటాలతో ఇళ్లును నిర్మించేందుకు ఓకే చెప్పారు. ఈ ఇంటికోసం ఏకంగా 30 కోట్లను కేటాయించనున్నట్టు అధికారులు తెలిపారు.. భవన నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు సీఎం కేసీఆర్ ఆమోదించారు. ఇందులో 1000 మందికి కూర్చునే హాలు, కేబినెట్ మీటింగ్ హాల్, ప్రజల సందర్శన కోసం మరో హాలు, పార్కింగ్ కోసం 1000 వాహనాలు పట్టేలా ఏర్పాట్లు ఇలా మరో వైట్ హౌస్ ను తలదన్నేలా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *