కేసీఆర్ కే మళ్లీ పట్టం కట్టాలి

కేసీఆర్ కే మళ్లీ పట్టం కట్టాలి

అభివృద్ధిని ఆశీర్వదించండి
– మహాకూటమికి బుద్ధి చెప్పండి
-టీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు
నిరంతరం తెలంగాణ అభివృద్ది కోసం పరితపిస్తున్న సీఎం కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని టీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెం, ధరవత్ తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులు, డప్పుచప్పుళ్లు, ఒగ్గుడోళ్లతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ పాలకుర్తిలో అభివృద్ధికి, అవినీతికి మధ్య పోటీ జరుగుతోందన్నారు. నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేపట్టిందని, కాంగ్రెస్ చేసింది శూన్యమని అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇంటి విద్యుత్ బిల్లులు మాఫీ చేశామని, మేనిఫెస్టోలో పేర్కొనని పథకాలను ప్రవేశ పెట్టామని తెలిపారు. సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన ప్రజలు సీఎంగా కేసీఆర్ కు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ మంజూరు చేసిన రూ.200 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు. అవినీతి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్నారు. రాబోయే రోజుల్లో దేవాదుల కాలువల్లో 365 రోజులు నీరు పారించేందుకు కృషి చేస్తానన్నారు. తాగు, సాగు నీరు, యువకులకు ఉపాధి కల్పనే లక్ష్యమన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎన్. సుధాకర్ రావు, జీసీసీ చైర్ పర్సన్ గాంధీనాయక్, జడ్పీటీసీ లలిత ప్రేమకుమార్, మండల నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

errabelli dayakar-rao 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *