
మంచోడు.. మంచోడు అంటూనే మంచె ఊడగొడుతున్నట్టే ఉంది ఈనాడు పత్రికల రాతల పరిస్తితి.. ఓ వైపు హైదరాబాద్ లో రైతు ఆత్మహత్యలు, రాష్ట్రంలో అన్నదాతలు ఉసురు తీసుకుంటున్నారంటూ ప్రత్యేక కథనాలు, వ్యాసాలు, వారి అభిప్రాయాలు ఇస్తున్న ఈనాడు … తెల్లవారే ప్రభుత్వ ఆగ్రహంతో ఇస్తున్న వివరణలను పతాక శీర్షికల్లో వేస్తోంది..
ఓ వైపు బ్లేమ్ చేస్తూనే మరో వైపు కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ రాతలు రాస్తోంది.. ఏంతైనా ఆంధ్రా నాయకత్వంలోని పత్రిక కావడం దాని పాత వాసనలు పోవట్లేదు.. ఇక ఈరోజు ఈనాడు పెట్టిన హెడ్డింగ్ కేసీఆర్ చైనా వాల్ సందర్శనపై ‘అత్యద్భుతం చైనా వాల్ ’ అంటూ పుండు మీద కారం చల్లేలా బ్యానర్ చేసింది..
ఓవైపు రైతు ఆత్మహత్యలపై ఫోకస్ చేస్తూనే ప్రతిపక్షాలకు ఉప్పందేలా విదేశాల్లో కేసీఆర్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఈనాడు హెడ్డింగ్ పెట్టింది.. దీనిపై ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకొని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ చైనాలో టూర్లు తిరుగుతున్నాడని మండిపడుతున్నారు.