
ఢిల్లీ : ప్రతిష్టాతంగా నిర్వహించే సీఎన్ఎన్ ఐబీఎన్ పీపుల్స్ చాయిస్ కోసం ప్రతీ సంవత్సరం ఆన్ లైన్ ఓటింగ్ పెడతారు. దేశ వ్యాప్తంగా ప్రజలు తమకు ఇష్టమైన నేతకు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను, దేశంలో ప్రభావితం చేసిన వ్యక్తులను అవార్డులకు ఎంపిక చేసి ఓటింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే నిర్వహించిన ఈ సంవత్సరం పోటీల్లో సీఎం కేసీఆర్ కు ప్రతిష్టాత్మకమైన ‘సీఎన్ఎన్ ఐబీఎన్’పాపులర్ ఛాయిస్ అవార్డు-2014 లభించింది. మంగళవారం ఢిల్లీలో కేసీఆర్ తరఫున ఎంపీ కేశవరావు కేంద్ర ఆర్థికమంత్రి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు.
ఈ అవార్డు తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులకు అంకితమని ఈ సందర్భంగా కేకే పాల్గొన్నారు. ప్రత్యే క తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిన కేసీఆర్ కు దేశ వ్యాప్తంగా ఆదరణ ఉందని.. అందుకే ఎంతో మందిని కాదని కేసీఆర్ కు అవార్డు లభించిందని టీఆర్ఎస్ ఎంపీలు అన్నారు.