కేసీఆర్ కీర్తి ప్రపంచవ్యాప్తం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు ప్రపంచంలోని ఇతర దేశాలను ఆకర్శిస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ విధానాల రూపకల్పనలో కొత్త పంథాను అనుసరించడం వల్ల ప్రపంచం తెలంగాణ వైపు చూసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది పథంలో దూసుకుపోతున్నదని ప్రశంసించడమే కాకుండా చైనాలో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో జరిగే “న్యూ చాంపియన్స్‌ – 2015” సదస్సుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్‌ రావును ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 9 నుండి 11 వరకు జరిగే సదస్సులో పాల్గొనాలని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఫిలిప్‌ రోస్లర్‌ (Philipp Rosler) ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బహుళ జాతి సంస్థలు, ప్రభుత్వాలు, మీడియా, విద్యా సంస్థలు, పౌర సమాజాలకు సంబంధించిన దాదాపు 1500 మంది ప్రముఖులు ప్రతినిధులుగా హాజరయ్యే సదస్సులో నూతన ఆవిష్కరణలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ లాంటి అంశాలపై చర్చ జరుగుతుంది. భవిష్యత్తును తీర్చిదిద్దేవిధంగా వేగంగా పురోగమిస్తున్న భావితరాలకు 2015లో అద్బుత ఫలితాలు సాధించిన ప్రగతి సాధకులు దిశా నిర్దేశం చేస్తారు.

ఈ క్రమంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అద్వితీయంగా అభివృద్ది వైపు పరుగులెత్తిస్తున్న పని విధానానికి సంబంధించిన అభిప్రాయాలను పంచుకోవడం సదస్సుకు గొప్ప విలువను తెచ్చిపెడుతుందని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ఫిలిప్‌ రోస్లర్‌ పేర్కోన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ది, పట్టణీకరణ, నూతన ఆవిష్కరణలతో కూడిన అభివృద్ది తదితర అంశాల్లో జరిగే చర్చలో ముఖ్యమంత్రి అభిప్రాయాలు అవసరమనే ఉద్దేశ్యంతోనే ఆహ్వానిస్తున్నట్లు లేఖలో రాశారు. ముఖ్యమంత్రితో పాటు వ్యాపార ప్రతినిధి బృందాన్ని కూడా వెంట తీసుకురావాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *