కేసీఆర్ ఆ అలవాటును మానుకోలేదు..

సీఎం కేసీఆర్ కు ఒక మంచి అలవాటు ఉంది.ఆయన తాత, తండ్రుల నుంచి నేర్చుకున్న గొప్ప లక్షణాన్ని ఆయన స్వతహాగా పాటిస్తూ పలువురికి చెబుతూ కొనసాగిస్తున్నారు. అదేంటంటే రాత్రి ప్రయాణాలు చేయకపోవడం.. నిజం.. ఆయన ఏ కార్యక్రమమైనా సరే అక్కడి వెళ్లడానికి రాత్రి ప్రయాణాలు చేయరు.. ముందురోజు సాయంత్రమే అక్కడికి చేరుకొని స్థానికంగా రాత్రి బస చేసి ఉదయమే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. మళ్లీ చీకటిపడకముందే తన స్వగృహానికి చేరుకుంటారు..

సీఎం కేసీఆర్ ముందునుంచి నమ్మకాలు, దేవుడిపై భక్తి ఎక్కువ.. ఆచార వ్యవహారాలను ఆయన తూ.చ. తప్పకుండా పాటిస్తారు. రాత్రిళ్లు ప్రయాణాలు మంచివి కావని.. ప్రమాదాలకు దారీ తీస్తాయని మన పెద్దలు ఎప్పటినుంచో చెబుతారు. ఈ విషయంలో కేసీఆర్ పకడ్బందీగా ఉంటారు. ఆయన మొన్న చిన్న ముల్కనూర్ దత్తత గ్రామంలో పర్యటించి సాయంత్రం 6 కాగానే హైదరాబాద్ వెళ్లిపోలేదు.. సీఎం అయ్యిండి అత్యంత భద్రత మధ్య పోగలిగే కేపాసిటీ ఉన్నా సరే.. ఆయన పోకుండా కరీంనగర్ లోని తెలంగాణ భవన్ లో బస చేశారు.  తెల్లవారి నేడు కరీంనగర్ కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించి విలేకరులతో మాట్లాడి హెలిక్యాప్టర్ లో వెళ్లిపోయారు. అక్కడికే కాదు మొన్నీ మధ్య వరంగల్ జిల్లా గంగదేవి పల్లెకు పోవడానికి కూడా ముందు రోజు సాయంత్రం వరంగల్ చేరుకొని తెల్లవారి వరంగల్ నుంచి గంగదేవి పల్లె వెళ్లారు. కేసీఆర్ ఏ కార్యక్రమమైనా.. ఎక్కడికి వెళ్లాలన్న అక్కడ ముందు రోజు రాత్రి బస చేసి తెల్లవారే శుభసూచికంగా పనులు చేసుకుంటారు..

అలా కేసీఆర్ కు రాత్రి ప్రయాణాలు చేయకపోవడమనే మంచి అలవాటు ను ఇంకా కొనసాగిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.