
విజయవాడ : కేసీఆర్ నువ్వు ఆడ మగ .. అది నోరా.. హుస్సేన్ సాగరా.. నీ భాష మార్చుకో అని ధ్వజమెత్తారు ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు. నువ్వొక సీఎంవి ఆ సోయిలేకుండా మాట్లాడినవ్ .. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాట్లాడితే నీకు తగిన విధంగా సమాధానాలిచ్చేవాడిని అని అన్నారు.
విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ చేసిన విమర్శలకు దేవినేని ఉమ బదులిచ్చారు. తెలుగుభాషలోని 56 అక్షరాలను సరిగా వాడు .. నీకు సంస్కారం లేదు అని ధ్వజమెత్తారు. నువ్వు కట్టే ప్రాజెక్టులకు అనుమతులున్నాయా అని ప్రశ్నించారు.