Breaking News

కేసీఆర్-ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు కలిసిపోయారు..

004

-చండీయాగానికి ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ
-కేసీఆర్, ఆంధ్రజ్యోతి ఎండీల చెట్టాపట్టాల్
-ఇక కేసీఆర్ కు ఆంధ్రజ్యోతి సానుకూలమే..
కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న చండీయాగం తెలంగాణలో ఒక అరుదైన రాజకీయ మార్పుకు పురుడుపోసింది.. ఒకప్పుడు ఆప్త మిత్రులు.. ప్రస్తుతం పచ్చగడ్డివేస్తే భగ్గుమంటున్న స్థాయిలో కీచులాడుకున్న సీఎం కేసీఆర్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణలు అయుత చండీయాగం సాక్షిగా ఒకరినొకరు పలకరించుకున్నారు.. కుషల ప్రశ్నలు వేసుకున్నారు.. శత్రువులు మిత్రులు కావడానికి కారణమైన చంద్రబాబు మాత్రం ఈ సందర్భంలో లేరు.

00

ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తో కలిసి చండీయాగానికి వచ్చిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ముందుకు గేట్ వద్ద మంత్రి హరీష్ రావు స్వాగతం పలికి యాగస్థలికి తోడ్కొని పోయారు. అనంతరం కోడెల, రాధాకృష్ణలు అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం కోడెల, రాధాకృష్ణలను కేసీఆర్ అప్యాయంగా పలకరించారు. వారిద్దరు చాలా సేపు ముచ్చటించారు.

002

చండీయాగం వేదిక తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలను సృష్టించింది. ఇన్నాళ్లు తెలంగాణలో ఆంధ్రజ్యోతితో కేసీఆర్ ను టార్గెట్ చేసిన రాధాకృష్ణ ఇక కేసీఆర్ అనుకూలుడిగా మారిపోవడంతో టీఆర్ఎస్, అధినేత కేసీఆర్ ఇక తెలంగాణలో ప్రతిపక్షమే ఉండదు.. ఇన్నాళ్లు నిషేధానికి గురైన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కూడా ఇక తెలంగాణలో పునప్రసారమయ్యే అవకాశాలున్నాయి.. అయుత చండీయాగం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను, కేసీఆర్ ను కలిపేసింది.. గత నెలలో చంద్రబాబు నివాసంలోనే వీరిద్దరి భేటి జరిగినా బహిరంగంగా కేసీఆర్-రాధాకృష్ణలు ఎదురుపడడం ఇదే తొలిసారి.. దీంతో ఇక ఆంధ్రజ్యోతికి మంచిరోజులు వచ్చినట్టే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *