కేసీఆర్ అభివృద్ధి నమూనా కు దేశ వ్యాప్తంగా ప్రశంసలు: హరీష్ రావు

కేసీఆర్ అభివృద్ధి నమూనా కు దేశ వ్యాప్తంగా ప్రశంసలు.
నాటి తెలంగాణ సాయుధ పోరాటానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే పునాది.
-మంత్రి హరీశ్ రావు.
“దొడ్డి కొమరయ్య ఆనాటి తెలంగాణ  ఉద్యమానికి స్ఫూర్తి. ప్రేరణ. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆయన అమరత్వమే నాంది.దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. దేశముఖ్ లకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు.  2001 నుంచి సాగిన మలి దశ తెలంగాణ ఉద్యమంలో నూ ఎంతో మంది బలిదానాలు చేశారు. త్యాగాల పునాదులపైనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ అంటే అందరికీ ముందుగా యాదికొచ్చేది దొడ్డి కొమురయ్య.  జనగామ తాలూకాలో ఆనాడు మొత్తం 60 గ్రామాల్లో విసునూరు దేశ్‌ముఖ్‌దే ఇష్టా‘ రాజ్యం’.దోపిడీ, హింసకు ఆయన గడీ కేంద్రంగా ఉండేది. వారిపై తిరగబడి నందుకు దొడ్డి కొమురయ్యను కాల్చి చంపారు.  భూమికోసం, భుక్తికోసం, వెట్టినుంచి విముక్తి కోసం జరిగిన పోరులో దొడ్డి కొమురయ్య తొలి అమరుడయ్యిండు. వెనుకబడిన గొల్లకులంలో పుట్టిన కొమురయ్య ఎంతో మందికి స్ఫూర్తి నిచ్చారు.
ఆనాటి దొడ్డికొమరయ్య వారసులు కుర్మలు.కుర్మల ముఖ్యమంత్రి ఉన్న కర్ణాటక వంటి రాష్ట్రంలో కూడా కుర్మలకు న్యాయం జరగడం లేదు.తెలంగాణ లో కుర్మలు చాలా శక్తిమంతులు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కోటిన్నర గొర్రెలను పంపిణీ చేయబోతున్నాం. దేశం మొత్తం మాంసం తయారు చేసి పంపే విధంగా తెలంగాణ కుర్మలు అభివృద్ధి చెందాలి.గతంలో ముఖ్యమంత్రులు గా పనిచేసిన వారి ప్రాధాన్యత లు వేరు.
కంప్యూటరే అభివృద్ధి అని చంద్రబాబు అన్నారు.రియల్ ఎస్టేట్ రంగమే అభివృద్ధి అని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అన్నారు. పేద ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమ ఫలాలు అందించడం, తాగునీరు, సాగునీరు అందించడమే కేసీఆర్ అభివృద్ధి నమూనా. దేశమంతా కేసీఆర్ అభివృద్ధి నమూనా ను ప్రశంసిస్తున్నది.
ఆకలి లేని, ఆత్మహత్యలు లేని,ఆకు పచ్చ తెలంగాణ నిర్మాణం కేసీఆర్ లక్ష్యం.పేదప్రజల కోసం నిరంతరం ఆయన తపన పడుతున్నారు.తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన వాళ్ళు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ ఏర్పాటును అప్పుడు వ్యతిరేకించిన  ఇతర శక్తులతో కాంగ్రెస్  చేతులు కలిపింది. ఆ శక్తులే ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నారు.జెఏసీ కోదండరాం వైఖరి సరైనది కాదు. తెలంగాణ వ్యతిరేకులంతా ఒక్కటవుతున్నరు. సాగర హారం,మిలియన్ మార్చ్ లో పాల్గొన్నదేవరు?లాఠీ దెబ్బలు, భాష్ప వాయు గోళాలకు ఎదురొడ్డి న దేవరు? శాశ్వతంగా రైతుల  ఆత్మహత్యలు లేకుండా చేయడానికి  సాగునీటి ప్రాజెక్టుల కు సి.ఎం.కేసీఆర్ దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు పోతుంటే తప్పుడు కేసులు వేస్తూ అడ్డుకుంటున్నారు.”

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *