కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరిన చంద్రబాబు

వివాదాస్పదస్థాయిలో కొట్టుకొని తిట్టుకొని వేరైనా తెలుగు రాష్ట్రాల సీఎంలు మరోసారి ఒక్కటవుతున్నారు. ఓటుకు నోటు కేసు తర్వాత ఉప్పు నిప్పులా ఉంటున్న సీఎంలు కేసీఆర్ , చంద్రబాబులు ఏపీ సీఎం చంద్రబాబు చొరవతో మరోసారి ఒక్కటవుతున్నారు. ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం ప్రధానిని ఆహ్వానించిన చంద్రబాబు.. అదే ఊపులో తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు రేపు సాయంత్రం 4 గంటలకు అపాయింట్ మెంట్ అడిగారు. ఏపీ సీఎం పేషీ అధికారులు తెలంగాణ సీఎం పేషీ అధికారులకు ఫోన్ చేసి కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరారు. రేపు సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు కేసీఆర్ ను కలువనున్నారు.

కాగా అమరావతి శంకుస్థాపన కోసం కేసీఆర్ వెళ్లరని సమాచారం. తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్ లు శంకుస్తాపన వెళతారని సమాచారం. వీరితో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మా, మరొకరు నలుగురి బృందాన్ని అమరావతికి పంపనున్నట్టు కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ చంద్రబాబు పిలిచినా వెళ్లకపోవడం విశేషం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *