
సీఎం కేసీఆర్ ప్రజలతో తన అంతరంగాన్ని, తన విజన్ ను ఆవిష్కరించారు. ప్రాజెక్టుల నుంచి మొదలుకొని పథకాల వరకు, నిరుద్యోగం, ఉపాధి ఇతర అన్ని రంగాల గురించి, తెలంగాణ ఎలా అభివృద్ధి చేసేది అన్ని కూలంకషంగా చర్చించారు. నిన్న రాత్రి మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ప్రాజెక్టులపై మాట్లాడారు.. రంగారెడ్డి జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో ఉందని.. ఆ జిల్లాకు శ్రీశైలం నీళ్లు ఇచ్చి తీరుతామని ప్రకటించారు. తెలంగాణ జిల్లాలన్నీ తనకు సమానమేనని కేసీఆర్ చెప్పారు. తెలంగాణకు నీళ్లు తెచ్చేందుకు ఉన్న ఏకైక నది గోదావరినేనని.. ఆ నీళ్లను ఒడిసిపట్టేందుకే ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేపట్టినట్టు కేసీఆర్ నీటి ప్రాజెక్టుల తీరుపై వివరించారు. 2017 నాటికి అన్ని గ్రామాలకు మిషన్ భగీరత పథకంలో ఇంటింటికి నల్లానీరు అందిస్తామని చెప్పారు.
అధికారులు, ప్రజాప్రతినిధుల అవినీతిని సంహించనని.. ఎవరైనా తనకు చెప్పాలని వీలుకాకపోతే ఒక లెటర్ రాసి పంపాలని సూచించారు. అలాగే డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చి తీరుతామని ప్రతిన బూనారు. పేదలు ఈ పథకంలో భాగంగా దళారులకు ఒక్క రూపాయి ఇవ్వవద్దని అవినీతి లేకుండా డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్ చెప్పారు.