కేసీఆర్ అంటే కచర..

కరీంనగర్ : టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కరీంనగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు . కేసీఆర్  పాలనపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ అంటే ల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదని.. కచర అని కేసీఆర్ మాటలన్నీ నీటి మూటలన్నారు. కేసీఆర్ పాలనలో మళ్లీ యువత నక్సలిజం వైపు అడుగులు వేస్తున్నారన్నారు. ఇటీవల వరంగల్ ఎన్ కౌంటర్ ఘటన ఇందుకు నిదర్శనమన్నారు.

కరీంనగర్ ను లండన్ చేస్తానన్న కేసీఆర్ మాట ఏమైందని ప్రశ్నించారు.  మానేరు డ్యాంను మైసూర్ బృందావనం చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు కరీంనగర్ గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. కరీంనగర్ గ్రానైట్ మాఫియా జిల్లాను దోచుకుంటుందని విమర్శించారు. ఎమ్మెల్యేలందరూ గ్రానైట్ మాఫియాలో భాగస్వాములై ముడుపులు తీసుకుంటున్నారని మండిపడ్డారు.

జిల్లా మంత్రి ఈటెల రాజేందర్ హాస్టల్ లో చదువుకొని విద్యార్థులకు దొడ్డు బియ్యం పాలిష్ చేసి సన్నబియ్యంగా ఇస్తూ మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. దొడ్డు రాజేందర్ అంటూ విమర్శలు గుప్పించారు. అనంతరం  కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *