Breaking News

కేసీఆరే నా ఫ్రెండ్ షిప్ వద్దనుకున్నాడు..

vv

‘మొదట మేమిద్దరం ఫ్రెండ్స్. కానీ ఆ తర్వాత పరిణామాల్లో నాతో స్నేహాన్ని కేసీఆరే వద్దనుకున్నాడు.. ఏబీఎన్ పై టీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధంతో మా మధ్య స్నేహం మరింత చెడింది’ అన్నారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ. అమెరికాలోని డెట్రాయిట్ లో జరుగుతున్న తానా మహాసభల్లో పాల్గొన రాధాకృష్ణ అమెరికా వాసులతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే నిర్వహించారు. పలువురు భారతీయ అమెరికన్ లు అడిగిన ప్రశ్నలకు బదిలిచ్చారు.

ఏబీఎన్ పై నిషేధం విధించిన కేసీఆర్ ను అడుక్కునే పరిస్థితి లేదని.. సుప్రీంకోర్టులో తేల్చుకుంటామన్నారు. తనను కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా ప్రచారం చేస్తున్నానడని.. ఎన్నిరోజులు అలా అంటాడో అనుకోనివ్వండి అంటూ బదులిచ్చారు.

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, వైసీపీ నేత జగన్ ను ఆహ్వానించామని కానీ వారే రాలేదన్నారు. వారు వస్తే వారిని ఇంటర్వ్యూ చేస్తానని తెలిపారు.

రాష్ట్రం విడిపోక ముందు తెలంగాణ నష్టపోయిందని.. విడిపోయాక ఇప్పుడు ఆంధ్రా ప్రాంతం నష్టపోయిందని రాధాకృష్ణ పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *