కేసిీఆర్, తన్నీరు హరీష్ రావుల పేర్లు చరిత్ర పుటల్లో లిఖితమైన సుదినం ఈరోజు: కాళేశ్వరం ప్రాజెక్ట్ ది గ్రేట్

 తెలంగాణ గడ్డపై మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణలో జలధారలు కురిపించే కాళేశ్వరం ప్రాజెక్ట్ కల సాకారమయ్యింది.. ముఖ్యమంత్రి కెసిఆర్, భారీ నీటిపారుదల శాఖా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుల పేర్లు చరిత్ర పుటల్లో లిఖితమైన సుధినం ఈరోజు. తెలంగాణా ప్రజల హృదయాల్లో కెసిఆర్, హరీష్ రావులు చిరకాలం నిలిచిపోయే అద్భుతమైన దినం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైన దినం. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నాడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. గోదావరి మాత విగ్రహాన్ని కెసిఆర్ ఆవిష్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి మేడిగడ్డ బ్యారేజ్‌ను కెసిఆర్ ప్రారంభించారు. గవర్నర్ నరసింహన్.. ఏపీ, మహారాష్ట్ర సీఎంలు జగన్, ఫడ్నవీస్‌లు కొబ్బరి కాయలు కొట్టారు. అనంతరం జగన్, కేసీఆర్‌లు కలిసి కాళేశ్వరం శిలా ఫలకం ఆవిష్కరించారు. గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, సీఎం జగన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌లు మేడిగడ్డ బ్యారేజీ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రంలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్, రాజ్యసభ సభ్యులు జోగిని పల్లి సంతోష్ కుమార్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అక్కడే ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. అక్కడి నుంచి గవర్నర్, ముగ్గురు ముఖ్యమంత్రులు మేడిగడ్డ పంప్‌హౌస్‌ ఉన్న కన్నెపల్లికి చేరుకొని పూర్ణాహుతిలో పాల్గొన్నారు. తర్వాత 6వ నంబర్‌ మోటార్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.
నీటి ప్రవాహాలుండే డెలివరీ సిస్టర్న్‌ వద్ద గోదావరి జలాలకు పూజలు చేశారు. అనంతరం ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. తర్వాత కన్నెపల్లి గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్న భోజనాలు చేసిన తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు. అంతకముందు మేడిగడ్డ యాగశాలలో కేసీఆర్ దంపతులు హోమంలో పాల్గొన్నారు. శృంగేరీపీఠం అర్చకుల ఆధ్వర్యంలో జలసంకల్ప హోమం నిర్వహించారు. హోమానికి కేసీఆర్ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేశారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరుణుడి కరుణ కోసం వేద పండితులు జల సంకల్ప హోమం నిర్వహించారు. శృంగేరి పీఠానికి చెందిన ఫణిశశాంక్‌ శర్మ, గోపీకృష్ణ ఆధ్వర్యంలో 40 మంది వేద పండితులు పూజలు నిర్వహించారు. కాళేశ్వరం,కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద పంచాయిత్ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు హోమం నిర్వహించారు. అనంతరం కన్నెపల్లి పంప్ హౌజ్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.

ఇటు ఒక్కో పంప్ హౌస్‌ను ఒక్కో మంత్రి ప్రారంభించారు. మేడారం పంప్ హౌస్నును, మంత్రి మల్లారెడ్డి
లక్ష్మీపూర్ పంప్ హౌస్‌ను, మంత్రి జగదీష్ రెడ్డి
అన్నారం బ్యారేజీని, మంత్రి నిరంజన్ రెడ్డి
అన్నారం పంప్ హౌస్‌ను, మంత్రి మహమూద్ అలీ
సుందిళ్ల పంప్ హౌస్‌ను, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ లు ప్రారంభించారు. సిరిసిల్లలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొనగా సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు

★ ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతలు

★ 147 టీఎంసీల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం
★ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ. 80,500 కోట్లు

★ కాళేశ్వరం నిర్మాణానికి ఇప్పటి వరకు చేసిన ఖర్చు రూ. 50 వేల కోట్లు
★ ఈ ఎత్తిపోతల పథకంలో మొత్తం 19 పంపింగ్ హౌస్‌లు

★ మొత్తం 19 పంపింగ్ హౌస్‌లలో 82 సంపులు, భారీ మోటార్లు

★ కాళేశ్వరం కింద మొత్తం 1531 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాల్వల నిర్మాణం

★ 203 కిలోమీటర్ల మేర సొరంగం నిర్మాణం

★ ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీల నీరు ఎత్తిపోత

★ భవిష్యత్‌లో రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా ప్రణాళిక

★ కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలకు 4992 మెగావాట్ల విద్యుత్ వినియోగం

★ ఈ ప్రాజెక్టుతో 13 జిల్లాల్లోని 106 మండలాలకు లబ్ధి

★ కాళేశ్వరం ద్వారా 1581 గ్రామాల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు

★ కాళేశ్వరంతో కొత్తగా 18.25 లక్షల ఆయకట్టుకు సాగునీరు

★ మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు నీరు

★ కాళేశ్వరం ద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీలు

★ పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీలు కేటాయింపు

kcr     kcr 1     errabelli dayakar rao    kcr 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *