Breaking News

కేరళలో ట్రాన్స్ జెండర్లకు ఆటోలు

transgender_0

ట్రాన్స్ జెండర్లు ఉపాధిలేక రైళ్లలో, బస్టాండుల్లో అడుక్కోవడం చూస్తున్నాం.. వీరికి ఎవరూ పని ఇవ్వడం లేదు.. దీంతో భిక్షటనే వృత్తిగా బతుకు వెళ్లదీస్తున్నారు వీరు.. వీరికి ఉపాధి చూపించడానికి కేరళ ప్రభుత్వం సిద్ధమైంది.. ఈ మధ్య నగరంలో మహిళల భద్రత కోసం షీం ట్యాక్సీలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.. అలాగే .. ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించడానికి వారికి ప్రభుత్వం ట్యాక్సీలను పంపిణీ చేస్తోంది..దీని ద్వారా వారి జీవన పరిస్థితులను మెరుగుపరచాలని తలంచారు..

షీట్యాక్సీలు అయితే మహిళల కోసమే ఉపయోగపడుతున్నాయి.. అదే ట్రాన్స్ జెండర్ల జీ ట్యాక్సీలను ఇటు మహిళలు, అటు పురుషులకు ఉపయోగపడతాయని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల వారికి ఉపాధి.. ప్రజలకు మేలు జరుగుతుందని ప్రభుత్వ సామాజిక న్యాయ విభాగం ఈ ట్యాక్సీల పంపిణీకి శ్రీకారం చుట్టింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *