
ఇప్పుడు టీఆర్ఎస్ ప్రచార రథాలు ఇద్దరే మిగిలారు వారే కేసీఆర్ కొడుకు, మేనల్లుడు.. గ్రేటర్ బాధ్యతలను కొడుకు కేటీఆర్ కు అప్పగించిన కేసీఆర్.. నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక బాధ్యతలను అల్లుడు హరీష్ రావు అప్పగించి సైలెంట్ అయ్యారు.. పార్టీలోని తన వారసులను పరీక్షించే పనిలో పడ్డారు.. అందుకు తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికలను అస్త్రంగా ఎంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు బావ బావమరుదులు అయిన హరీష్ రావు, కేటీఆర్ లు ఇప్పుడు కీలక పరీక్షకు సిద్ధమవుతున్నారు. అదే ఉప ఎన్నికల పరీక్ష ఇందులో ఎవరు గెలిచినా ఓడినా కానీ వారి నాయకత్వ పరీక్షకు పార్టీ ని నడిపించే శక్తి స్థామర్థ్యాలకు సీఎం కేసీఆర్ పెట్టిన పరీక్షగా చూడొచ్చు..
గ్రేటర్ ఉప ఎన్నికల బాధ్యతను కేసీఆర్ తన కొడుకు మంత్రి కేటీఆర్ భుజాలపై పెట్టారు. ఆయన దూకుడుగా ప్రతిపక్షాలను కకావికలం చేస్తూ విజయం వైపు పరుగులు తీస్తున్నారు. ఇక మెదక్ జిల్లాలోని నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక బాధ్యతలను మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. అక్కడ ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇందులో ఎవరు గెలుస్తారు.. గెలిపాస్తారనే విషయంపైనే టీఆర్ఎస్ భవిష్యత్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం అనేది నిర్నయించబడిందని టీఆర్ఎస్ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. చూద్దాం.. బావ, బావమరుదుల్లో ఎవరు నిలుస్తారు.. గెలుస్తారో..?