కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ‘కటకం’ గృహనిర్బంధం

20150501b_016109017

ముస్తాబాద్ : మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటన నేపథ్యంలో ముస్తాబాద్ కు వచ్చిన కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ కటకం మృత్యుంజయంను పోలీసులు గృహనిర్బంధం చేయడం దుమారం లేపింది. గంభీరావు పేట సర్పంచి తదితరులు కేటీఆర్ పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళన చేయగా కటకం అక్కడి వచ్చి సంఘీభావం తెలిపేందుకు ముస్తాబాద్ నుంచి గంభీరావు పేట వెళ్తుండగా ఆయనను సిరిసిల్ల గ్రామీణ సీఐ రంగయ్య గౌడ్ తదితరులు గృహనిర్బంధం చేశారు.

ఈ సందర్భంగా కటకం మాట్లాడుతూ మంత్రి ప్రోద్బలంతోనే పోలీసులు తన పట్ల అతిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *