
శాసనసభా అప్పటివరకు ప్రశాంతంగా జరుగుతోంది.. కాంగ్రెస్, టీడీపీలు రైతు ఆత్మహత్యలపై మాట్లాడిన తీరు అధికార టీఆర్ఎస్ పార్టీని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు.. వారు కర్ర విరవకుండా, పాము చావకుండా బాగానే కొన్ని సూచనలు చెప్పి మాట్లాడి ఊరుకున్నారు.
ఇక అప్పుడు ఎంటర్ అయ్యాడు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ .. ప్రభుత్వాన్ని రైతు ఆత్మహత్యలపై కడిగిపారేశాడు.. కేసీఆర్ టోపీ పెట్టుకొని చేస్తున్న వ్యవసాయం పక్కనే ఉన్న రైతులు చేయడం లేదని.. కేసీఆర్ లాగే వారు స్మార్ట్ రైతులు కావాలంటూ ఎద్దేవా చేశారు. తానకు రైతులు , పొలాల గురించి తెలియకున్నా మాట్లాడుతున్నా తెలిసి వారందరూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
ఒక్కొక్క మాట అధికార పక్షాన్ని సూదులుగా గుచ్చింది.. అక్బర్ పంచ్ లకు బెంబేలెత్తిన టీఆర్ఎస్ సర్కారు కు కేటీఆర్ ఎంటర్ తో కొంత ఉపశమనం కలిగించినా.. అక్బర్ కేటీఆర్ ను ఉతికి ఆరేశాడు.. అమెరికాలో చదువుకొని వచ్చిన నీకు రైతుల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. మంత్రుల నియోజకవర్గంలో ని రైతు ఆత్మహత్యలు ఏ మంత్రి ఇలాఖాలో ఎన్ని జరిగింది వివరించే సరికి అధికార టీఆర్ఎస్ సర్కారు నేతల మొహాలు తెల్లబోయాయి. కేేటీఆర్ మొఖం అయితే వాలిపోయింది..
ఇలా కాంగ్రెస్, టీడీపీ చేయని పనిని ఎంఐఎం అక్బర్ చేసి టీఆర్ఎస్ వెన్నులో వణుకు పుట్టించాడు..