Breaking News

కేటీఆర్ ది అయిపోయింది.. హరీష్ ది మిగిలింది..

harish-rao-KTR

గ్రేటర్ ప్రచారం ముగిసింది.. కేటీఆర్ విస్తృత ప్రచారం చేసి గ్రేటర్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు… అన్ని తానై గ్రేటర్ లో గెలుపు వాకిట నిలిచారు.. అక్కడికి అది పోయింది. ఇక నిరూపించుకోవాల్సిన బాధ్యత హరీష్ పై ఉంది. గ్రేటర్ ప్రచారం ముగియడంతో ఇక టీఆర్ఎస్ దృష్టి అంతా మరో ఉప ఎన్నిక అయిన నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంపై పడింది.. నేతలంతా ఇప్పుడు హరీష్ స్టామినా పై చూస్తున్నారు. గ్రేటర్ ముగిసిన నేతలంతా మళ్లీ ప్రచారానికి నారాయణఖేడ్ కు తరలివెళ్తున్నారు..

గ్రేటర్, ఖేడ్ లలో ఎవరు గెలుస్తారో గెలిపిస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. హరీష్, కేటీఆర్ లు తమ నాయకత్వానికి పరీక్ష పెట్టిన కేసీఆర్ ముందు నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందులో గ్రేటర్ లో కేటీఆర్ గెలుస్తారా..? లేక నారాయణఖేడ్ లో హరీష్ విజయతీరాలకు చేరుతారా అన్న మీమాంసలో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ రాజ్యమేలుతోంది. ఫలితాల వరకు వేచిచూడక తప్పదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *