
ఓటుకు నోటు కేసులో ముత్తయ్యను బెదిరించారనే ఆరోపణలపై తమ వద్దకు హాజరుకావాలని ఏపీ సీఐడీ అధికారులు కేటీఆర్ డ్రైవర్, గన్ మెన్ లకు నోటీసులు జారీ చేసేందుకు రావడం ఉద్రిక్తతకు దారితీసింది..ముందుగా ఏపీ సీఐడీ అధికారులు తెలంగాణ సచివాలయంకు రాగా పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో కాలినడకన సచివాలయంలోకి వెళ్లి అక్కడ లేరని తెలుసుకొని వెనుదిరిగారు.
ఆ తర్వాత సీన్ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు మారింది. అక్కడే కేటీఆర్ , ఆయన డ్రైవర్ గన్ మెన్ ఉంటుండడంతో వారికి నోటీసులు ఇద్దామని రాగా మళ్లీ లోపలికి అనుమతించలేదు పోలీసులు.. ఇక నందినగర్ లోని సీఎం కేసీఆర్ పాత ఇంటికి వెళ్లగా అక్కడ ఏపీ పోలీసులను అనుమతించలేదు. దీంతో నిరాశగా వెనుదిరిగారు ఏపీ పోలీసులు..
మీరు నోటీసులు ఇవ్వదగ్గ వ్యక్తులు ఇక్కడ లేరంటూ తెలంగాణ పోలీసులు ఏపీ సీఐడీ అధికారులను వెనక్కిపంపారు.