
మంత్రి కేటీఆర్ తెలంగాణను ఐటీ సిటీగా మార్చేందుకు చేస్తున్న కృషి ఫలిస్తోంది. అప్పట్లో ఆయన అమెరికా వెళ్లి యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ తదితర కంపెనీలను కలిసి వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఇప్పటికే గూగుల్ , మైక్రోసాఫ్ట్ లు హైదరాబాద్ లో తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయి..ఇప్పుడు యాపిల్ కూడా ఇన్నోవేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తోంది..
యాపిల్ సీఈవో టిమ్ కుక్ హైదరాబాద్ వస్తున్నారు. అమెరికా ఆవల యాపిల్ తమ అతిపెద్ద కేంద్రాన్ని హైదరాబాద్ లో నిర్మించింది. దీని ఓపెనింగ్ కు వస్తున్న కుక్ , కేసీఆర్, కేటీఆర్ లతో భేటి అవుతారు. అనంతరం ఇన్నోవేషన్ ప్రోగ్రాంలో పాల్గొని యాపిల్ కేంద్రాన్ని ప్రారంబిస్తారు. దీనికి కేసీఆర్, కేటీఆర్, గవర్నర్ లు హాజరవుతారు..
కాగా తెలంగాణకు యాపిల్ రావడం, ఇక్కడో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రం ఏర్పాటు కు మొగ్గుచూపడం కేటీఆర్ కృషి కి నిదర్శనం.. ఆయన చొరవతో తెలంగాణ ఐటీ రాజధానిగా కావడం తథ్యమని నాయకులు సంబరపడుతున్నారు.