Breaking News

కేజ్రీ విజయం వెనుక సునీత

Delhi-Chief-Minister-Arvind-Kejriwal-with-his-wife-Sunita

హైదరాబాద్, ప్రతినిధి : ప్రతీ పురుషుడి వెనుక ఓ మహిళ ఉంటుందని అంటారు.. కానీ ఢిల్లీ ని ఊడ్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ వెనుక మాత్రం ఆయన భార్య సునీత ఉందని కేజ్రీవాలే స్వయంగా ప్రకటించారు. తాను ప్రచార పర్వంలో దూసుకెళ్లడానికి.. తన వ్యూహాలను సమర్థంగా అమలుపరచడంలో.. ప్రజలకు చేరువ కావడంతో తన భార్య ఎంతో ప్రోత్సహించిందని కేజ్రీవాల్ గెలుపు అనంతరం వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్, బీజేపీల గర్వమే వారిని శిక్షించిందని.. ఆ విజయం గర్వం తలకెక్కించుకోవద్దని ఆప్ కార్యకర్తలకు సూచించారు. లేకపోతే ప్రజలు మనకు ఇలాంటి శిక్ష విధిస్తారని కేజ్రీ హెచ్చరించారు. అందరం కలిసి ఢిల్లీని తీర్చిదుద్దాతామని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలో అవినీతిని ఏరిపారేద్దామని వ్యాఖ్యానించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *