Breaking News

కేజ్రీవాల్ ఖుషీ.. ఖుషీ

kezriwall-960x630

ఢిల్లీ, ప్రతినిధి : ఢిల్లీ ఫలితాలు తమకు అనుకూలంగా వస్తున్నాయన్న సర్వేల వెల్లడితో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ ఖుషీ.. ఖుషీగా ఉన్నారు. పోలింగ్ తర్వాత ఫలితాల వెల్లడికి రెండురోజుల గ్యాప్ లో ఉల్లాసంగా కుటుంబ సభ్యులతో గడిపారు.

ఉదయాన్నే ‘విపాసన’ ధ్యానపద్దతిని పాటించే కేజ్రీవాల్ తెల్లవారగానే యోగా, ధ్యానం పూర్తిచేశారు. కార్యకర్తలందరూ అద్భుతంగా పనిచేశారని.. ఈ రెండురోజులు మీమీ కుటుంబాలతో గడుపుతూ హాయిగా నిద్రపోవాలని ట్విట్టర్ సూచించారు.

మధ్యాహ్నం వేళలో కీలక ఆప్ నేతలంతా ఆయన నివాసానికి వచ్చి చర్చలు జరిపారు. ఫలితాలు సానుకూలమన్న సంకేతాలతో ప్రభుత్వ ఏర్పాటు తదితర విషయాలపై చర్చించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *