
హైదరాబాద్, ప్రతినిధి : కేజీ టు పీజీ విద్య వ్యవస్థపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తో శుక్రవారం మంత్రి జగదీష్, విద్యాశాఖాధికారులు భేటీ అయ్యారు. ఈ భేటీలో కేజీ టు పీజీ విద్యపై సమగ్రంగా చర్చించినట్లు సమాచారం. రిజర్వేషన్లకు అతీతంగా అడ్మిషన్లు, 2016-17 నుండి ఈ విద్యా విధానం అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ప్రతి మండలానికి ఒక్కో స్కూల్..మొదటి ప్రయత్నం మూడు నుండి నాలుగు వేల మంది విద్యార్థులు ఉండే విధంగా చూడాలని..ఒకటి నుండి ఎనిమిదో తరగతి వరకు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఇంగ్లీషు బోధన చేయాలని. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను రెండు కేటగిరీలు (ప్రైమరీ..హై స్కూల్ )గా విభజించి శిక్షణనివ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.