కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర: చంద్రబాబు

కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ జాతీయ ఆధ్యక్షుడు చంద్ర బాబు నాడు స్పష్టం చేసారు. బీజేపీని ఓడించేందుకు ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. గురువారం నాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో  జరిగిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహనాడు లో ప్రసగించిన ఆయన..బీజేపీపై నిప్పులు చెరిగారు. అయితే పొత్తుల మీద మాత్రం ఏలాంటి స్పష్టత నివ్వలేదు.
టీటీడీపీ మహనాడు లో తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షోపన్యాసం చేసారు. తెలంగాణ అభివ్రుద్దికి టీడీపీ చేసిన క్రుషి ని వివరించారు. విద్యా, ఉపాది, పారిశ్రామిక రంగం, హైటెక్ సిటీ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో టీడీపీ పాత్రను విశదీకరించారు. బీజేపీ లక్షంగా చంద్రబాబు తీవ్ర విమర్శలు చేసారు. రాష్ట విభజన చట్టంలో పొందు పరిచిన హమీలను నేరవేర్చకుండా బీజేపీ….ఏపీ, తెలంగాణలకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రధాని మోడి ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు. తన చివరి శ్వాస వరకు తెలుగు జాతి అభివ్రుద్ది కోసమే పనిచేస్తాన్నారు. ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా వదులుకున్నానని గుర్తు చేసారు.వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో, తెలంగాణ రాష్టంలో ప్రభుత్వ ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని చంద్రబాబు ప్రకటించారు. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ లో టీడీపీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేసారు. ఇప్పుడు మరో సారి అలాంటి పరిస్థితులే పునారావ్రుతం అవుతాయన్నారు. అందుకే పార్టీ బలోపేతం కోసం నేతలంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. కర్నాటకలో జేడీఎస్, కాంగ్రెస్ కూటమికి మద్దతిచ్చాము తప్పితే..కాంగ్రెస్ తో తమకు ఏలాంటి సంబంధం లేదని స్పష్టం చేసారు.  పార్టీ  బలహీన  పడలేదని నిరూపించింది ఈ మహానాడు .టీటీడీపీ కార్యకర్తల్లో చాలా ఉత్సావం కనిపించింది. వేల సంఖ్యలో కార్యకర్తలు మహనాడుకు హజరయ్యారు. మొత్తం 8 తీర్మాణాలను మహనాడు ఆమోదించింది. అమలుకు నోచుకోని టీఆర్ ఎస్ హమీలు, రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగ సమస్య, సంక్షోభంలో ప్రజా సంక్షేమం, ప్రభుత్వ అప్రజాస్వామికి విధానాలు, సాగు నీటి ప్రజెక్టుల్లో అవినీతి అంశాలపై నేతలు చర్చించారు. కేసీఆర్ తన సొంత ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుబారా చేస్తుందని టీటీడీపీ అధ్యక్షుడు రమణ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే…ప్రగతి భవన్ ను ప్రభుత్వఆసుపత్రిగా మారుస్తామన్నారు.
కార్యకర్తల కోలహాలం, నాయకుల ప్రసంగాలు, కళకారుల అట పాటలతో మహనాడు ప్రాంగణం దద్దరిల్లింది. పార్టీ సీనియర్ నేత మెత్కుపల్లిని మహనాడుకు పిలవలేదని ఆయన అనుచరులు నిరసన తెలిపారు. పార్టీ ఎమ్మెల్యే ఆర్ క్రుష్ణయ్య గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. అయితే పొత్తులపై బాబు స్పష్టత నిస్తారని ఆశ పడ్డ నేతలు, కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. మొత్తంగా మహనాడును విజయవంతం చేయడం ద్వారా తెలంగాణలో టీడీపీకి బలముందని కార్యకర్తలు నిరుపించడంతో నేతల్లో ఆనందం వెల్లి విరిసింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, నాయకులు రావుల చంద్రశేఖర్రెడ్డి, నర్సిరెడ్డి, మేకల సారంగపాణి, జిల్లాల అధ్యక్ష ,కార్యదర్శులు పార్టీ నాయకులు , భారీ సంఖ్యలోో కార్యకర్తలు పాల్గొన్నారు.       – Nancy              IMG-20180524-WA0295IMG-20180524-WA0254IMG-20180524-WA0154IMG-20180524-WA0207IMG-20180524-WA0191

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *