కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి ప్రకాశ్ జవదేకర్ తో ముగిసిన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి భేటి

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి ప్రకాశ్ జవదేకర్ తో ముగిసిన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి భేటి

ఫలించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కృషి.

బాలిక విద్యపై కేబ్ ( క్యాబినెట్ అడ్వైజరీ బోర్డు ఆన్ ఎడ్యుకేషన్) సబ్ కమిటీ చైర్మన్ గా ఢిల్లీ, అస్సాం, భువనేశ్వర్, హైద్రాబాద్ నగరాల్లో సమావేశాలు నిర్వహించి బాలికల విద్యాభివృద్ధికి పలు ప్రతిపాదనలతో కూడిన నివేదిక ఇచ్చారు. దీనిపై నేడు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తో సమావేశమై చర్చించారు. కేజీబివిలు ప్రస్తుతం దేశంలో 8వ తరగతి వరకే ఉండగా..తెలంగాణలో 10వ తరగతి వరకు రాష్ట్ర ప్రభుత్వం నడుపుతోంది. అత్యంత పేదలు, తల్లిదండ్రులు లేని విద్యార్థినిలు చదువుకునే కేజీబీవీ లను 12వ తరగతి వరకు పొడిగించాలని చేసిన ప్రతిపాదనను కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారు. దీనితో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కృషికి ఫలితము దక్కినట్లు అయ్యింది.

ఈ నెల చివరన జరిగే కేంద్ర క్యాబినెట్ లో కేజీబీవిల పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టమైన హామి ఇచ్చారు. ఇంటర్ మీడియట్ వరకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఇంటర్ మీడియట్ వరకు స్కూల్ యూనిఫామ్స్ కూడా  అందించాలని కోరినట్లు చెప్పారు. ఇంటర్ మీడియట్ వరకు మధ్యాహ్న భోజనం, స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వడం, కేజిబీవిలను 12 వ తరగతి  పొడగించడం వల్ల మహిళల డ్రాపవుట్లను తగ్గించడమే కాకుండా విద్యాభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. హైదరాబాదు కు ఐఐఎం కేటాయించాలని కోరామన్నారు. పీజీ వరకు బాలికలకు ఉచిత, నిర్భంద విద్య అందించాలని కోరామన్నారు. తెలంగాణలో మాదిరిగా బాలికలకు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా గురుకుల విద్యాలయాలు నెలకొల్పాలని సూచించామన్నారు. మోడల్ స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్యను వంద నుంచి 200కు పెంచాలని చెప్పామన్నారు. బాలికలకు ఆరోగ్యం, పరిశుభ్రతకు సంబంధించి హెల్త్ కిట్స్ అందించాలని చెప్పామని, తెలంగాణలో ఇప్పటికే ఇస్తున్నామని వివరించినట్లు చెప్పారు. ఏపి పునః విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, మ‌హిళ విశ్వ‌విద్యాల‌యాల‌ను కేటాయించాని కోరామన్నారు. జనవరిలో జరిగిన కేబ్ (Central Advisory Board of Education) సమావేశంలో బాలిక‌ల విద్యాభివృద్ధి, కేజీబీవిల‌పై కేంద్ర‌ మంత్రి నుంచి ఎటువంటి స్పష్టత రాలేద‌ని ఉప ముఖ్య‌మంత్రి తెలిపారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర మంత్రి తో స‌మావేశ‌మై కేజీబీవిల ఏర్పాటు ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించామ‌ని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.  కేబ్ కమిటీ సిఫార్సుల మేరకు కేజీబీవీలను 12 వ తరగతుల వరకు పొడిగించ‌డ‌మే కాకుండా, ఈ ఏడాది నుంచే అమలవుతుందని  కేంద్ర మంత్రి స్ప‌ష్టంగా తెలిపార‌ని ఉప ముఖ్య‌మంత్రి తెలిపారు.

కేంద్ర క్యాబినేట్ ఆమోద ముద్ర‌తో బాల్య వివాహాలను అరికట్టడానికి, బాలికల డ్రాపవుట్లను తగ్గించడానికి కేజీబివీల పాత్ర కీల‌కంగా మారుతుంద‌ని ఉప ముఖ్యమంత్రి కడియం ఆశాభావం వ్య‌క్తం చేశారు.  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉన్న ఒక్క‌గాను ఒక్క ప‌ద్మావ‌తి మ‌హిళ యూనివ‌ర్సిటీ విభ‌జ‌న‌లో ఏపికి వేళ్లిపోయింద‌ని, ఈ నేప‌థ్యంలో తెలంగాణ కు ప్రత్యేకంగా ఒక మ‌హిళ విశ్వ విద్యాల‌యాన్ని ఏర్పాటు చేయాల‌ని కోరిన‌ట్లు ఉప ముఖ్య‌మంత్రి తెలిపారు. ఈ మ‌హిళ విశ్వ విద్యాల‌య ఏర్పాటు కు ఆర్థిక సాయం, సెంట్ర‌ల్ మ‌హిళ విశ్వ విద్యాల‌యంగా అభివృద్ధి చేసే బాధ్య‌త కేంద్ర ప్ర‌భుత్వం తీసుకోవాల‌ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌డేక‌ర్ ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, విద్యాశాఖ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రితో పాటు, పార్ల‌మెంట్స‌ భ్యులు  సి.మల్లారెడ్డి కూడా క‌లిశారు.  దేశ వ్యాప్తంగా బాలికల విద్యాభివృద్ధికి తాము సూచించిన ప్రతిపాదనలు అమలు చేయడం వల్ల డ్రాప్ అవుట్లు తగ్గడమే కాకుండా విద్యాభివృద్ధికి దోహదపడుతుంది అన్నారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తమ ప్రతిపాదనలపట్ల సానుకూలంగా స్పందించారు అన్నారు.

kadiyam srihari 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *