Breaking News

కేంద్ర మంత్రుల్లో సమర్థులు కొరత వేధిస్తోందట..

pm-modi_625x300_41423893207

మొన్న ఢిల్లీలో ఓటమి.. నేడు బీహార్ లో ఓటమి.. ఈ ఓటమికి పరోక్షంగా కేంద్రమంత్రులుగా చేస్తున్న కొందరు బీజేపీ నేతల వైఖరే కారణమని సమాచారం. బీహార్ ఎన్నికల అనంతరం ప్రధాని మోడీ తన మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో పునర్వ్యస్థీకరించాలని నిర్ణయించుకున్నారట.. కానీ సమర్థులు లేకపోవడంతో ఉన్నవారితోనే కొనసాగాలని నిర్ణయించారట.. మతచాందసవాద వ్యాఖ్యలతో చాలామంది బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు బీజేపీకి చెడ్డ పేరు తెస్తున్నారు. దాంతో దేశంలో కీలక శాఖలైన రక్షణ, విదేశీ , ఆర్థిక వంటి శాఖల్ని నిర్వహించే సత్తా ఉన్నా నాయకులు బీజేపీలో లేరు.

అరుణ్ జైట్లీని ఆర్థిక శాఖ నుంచి రక్షణకు మార్చాలని ప్రధాని నిర్ణయించారట.. కానీ అరుణ్ జైట్లీలా ఆర్థిక శాఖను నిర్వహించే నాయకుడు పార్టీలో కనిపించకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నాడట.. కాంగ్రెస్ లో ఆ సమస్యే లేదు.. కాంగ్రెస్ లో కేంద్ర మంత్రులుగా చేసిన వారందరూ పీహెచ్డీలు, తలపండిన న్యాయవాదులు, నాయకులు ఉండడంతో వారికి ఆ సమస్య ఎదురుకాలేదు.. కేంద్ర మంత్రులుగా బాగా సమర్థంగా పనిచేశారు. కానీ బీజేపీలో నరేంద్ర మోడీ వల్ల కేంద్రంలో అధికారంలోకి వచ్చినా అంత స్టామినా గల నాయకుల కొరత బీజేపీలో వేధిస్తోందట.. అందుకే మోడీ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణను విరమించుకున్నాడని సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *