కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ తో కీలక అంశాలపై చర్చించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తో సమావేశమయ్యి రాష్ట్ర వ్యవసాయ రంగానికి సంబందించిన పలు కీలక అంశాలపై చర్చించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి.

గురువారం నాడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీ లోని నేషనల్ అగ్రికల్చర్ సైన్స్ కాంప్లైక్స్ లో భారత వ్యవసాయ పరిశోధన మండలి(ICAR) 88వ వార్షిక సమావేశంలో పాల్గొన్నారు.కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు , అధికారులు పాల్గొన్నారు.సమావేశం లో భాగంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి పంటభీమా పథకంలో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిచేసినప్పుడే పధకం ద్వారా ఆశించిన ఫలితాన్ని రైతులకు అందించగలమని సూచించారు.అదే విధంగా స్వామినాధన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని సూచించారు.

సమావేశం అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు.ఈ సంధర్బంగా ఆయనను ఉపాధిహమీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు.మినీ భూసార పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు సూక్ష్మ సేద్యానికి కేంద్ర సబ్సిడి నిధులు పెంచాలని ఆయన కోరారు.చిన్న,మధ్య తరహ ఉద్యానవన రైతులకు ఉపయోగపడే సోలార్ కోల్డ్ స్టొరేజిల ఏర్పాటుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని ఆయన కోరారు.అదే విధంగా ఫాలిహౌజ్ పధకానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని పెంచాలని అడిగారు.తెలంగాణ రాష్ట్రంలో మెట్టసాగు పరిశోధన కేంద్రం, పత్తి పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా రాజీవ్ కృషియోజన గ్రాంట్లు పెంచాలని కోరారు.రాష్ట్రానికి హర్టీకల్చర్ యూనివర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధానమంత్రికి,కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ఆయన ఈ సంధర్బంగా కృతజ్ఞతలు తెలియజేశారు.మంత్రి ప్రతిపాదనల్ని సానుకూలంగా పరిశీలించిన కేంద్ర మంత్రి వాన్నింటినీ వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు.

ఈ సమావేశంలో మంత్రితో పాటు తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమీషనర్ అర్వింద్ కుమార్ కూడా పాల్గొన్నారు.

p.srinivasa reddy     pocharam srinivasa reddy

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *