
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ కిందకు దిగే సమయంలో తివాచీలు అడ్డువచ్చాయి. ఆ హెలీ కాప్టర్ రెక్కలకు తివాచీలు అడ్డుపడి సమస్య సృష్టించాయి. కానీ ఈ ప్రమాదంలోంచి కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ తప్పించుకుంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రమాదం జరగకుండా సేఫ్ గా ల్యాండ్ అయ్యింది హెలీకాప్టర్ . దీంతో కేంద్రమంత్రి, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.