
– దత్తన్న ఇంట్లో దొంగలు పడ్డారు..
చట్టాలు చేసేది వారు.. అమలు చేసేది వారు.. చుట్టూ భారీగా సెక్యూరిటీ.. అసలు కేంద్ర మంత్రులంటేనే అదో పేద్ద అధికారం.. అంతటి పోలిస్ రక్షణ గల కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ ఫోనే కొట్టేశారు దొంగలు.. ఏకంగా ఆయన ఇంట్లో ఆయన వాడే సామ్ సంగ్ గేలాక్సీ ఫోన్ ను కొట్టేసి కేంద్ర మంత్రికే జలక్ ఇచ్చారు..
కేంద్ర మంత్రి దత్తాత్రేయ గల్లీల పర్యటనకు వెళ్లినప్పుడు తన ఫోన్ ను మరిచిపోయారు. ఇంట్లో పట్టి వెళ్లిపోయిన ఆయన వచ్చి చూసేసరికి ఫోన్ కనిపించలేదు. ఇంట్లో అంతా వెతికాడు.. తరువాత వేరే నంబర్ నుంచి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో తన ఫోన్ పోయిందని గ్రహించిన దత్తన్న ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి కేంద్ర మంత్రి ఫోన్ కే రక్షణ లేకుండా పోయింది కాబట్టి ఇక మీ ఫోన్లు జాగ్రత్త సుమీ..