కేంద్ర బడ్జెట్ పై ఈటల రాజేందర్ స్పందన

కేంద్ర బడ్జెట్ పై ఈటల రాజేందర్ స్పందన

ప్రజలపై ముద్ర లేదు.

తెలంగాణకు నిధులు లేవు

సుమారు 40 వేల కోట్లు ఆడిగినం, ఇచ్చింది ఏమి లేదు.

దేశంలో తెలంగాణ అంతర్భాగమే కదా.. ప్రగతిశీల నిర్ణయాలు తీసుకొని ముందుకి వెళ్తున్న రాష్ట్రాలకి సాయం అందించాల్సిన భాద్యత కేంద్రం మీద ఉంది. అప్పుడే మిగతా రాష్ట్రాలు వీటని చూసి స్ఫూర్తి పొందుతాయి. అభివృద్ధి విషయంలో రాష్ట్రాల మధ్య పోటీని పెంచే విధంగా కేంద్ర నిర్ణయాలు ఉండాలి. ప్రపంచమంతా గ్లోబల్ వార్మింగ్ గురించి, భూగర్భ జలాల గురించి ఆలోచిస్తుంటే మేము మిషన్ కాకతీయతో దానికి పరిస్కారం చూపిస్తున్నాం. దీనివల్ల భూగర్భజలాలు పెరిగినాయి ఎండిపోతున్న చెట్లు బ్రతికినాయి, పక్షులు వలసలు వస్తున్నాయి. వీటితో జీవం పోస్తున్నాం..  క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఏంచేయాలి అని మిగతవారు ఆలోచిస్తుంటే మనం 500 రెసిడెన్సిల్ స్కూల్స్ పెట్టినం. వీటన్నింటికోసం కేంద్రాన్ని నిధులు అందించమని ఆడిగినం కానీ కేంద్రం పెట్టిన బడ్జెట్ లో కేటాయింపులు లేవు. వ్యవసాయం, విద్య, వైద్యం పై దృష్టి పెట్టినట్టు కనిపించినా బడ్జెట్ గొప్పగా ఉంది అని భావన కలిపించలేక పోయింది. కొత్తది చిన్నదే అయినా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా గొప్ప నిర్ణయాలు తీసుకుంటూ మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంది. మిషన్ కాకతీయకు 5 వేల కోట్లు, మిషన్ భగీరథకు 19,205 కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్ కేంద్రాన్ని కొరినం. 88 వేల కోట్లతో అతివేగంగా నిర్మిస్తున్న మానవ అధ్బుత నిర్మాణం కాళేశ్వరం కి ఇప్పటికే 22 వేల కోట్ల ఖర్చు చేసినం ఈ ప్రాజెక్ట్ కి 10 వేల కోట్లు ఆడిగినం.  విభజన చట్టంలో పేర్కొన్నట్లు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, హార్టికల్చర్, ట్రైబల్ యూనివర్సిటీ కేటాయించాలని కొరినం.

ఇవన్నీ కలిస్తే దాదాపు 40 వేల కోట్ల రూపాయలు తెలంగాణ కి ఈ బడ్జెట్లో కేటాయించాలని అరుణ్ జైట్లీ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రి-బడ్జెట్ కి హాజరై రాష్ట్రం తరపున విన్నవించాం. కానీ కేటాయింపుల్లో వాటి ప్రస్తావన లెక్కపోవడం బాధాకరం.  తెలంగాణ రాష్ట్రం మొదటినుండి రైతుకు వెన్నుదన్నుగా ఉంది. 17 వేల కోట్ల రుణమాఫీ చేసినం. నాణ్యమైన విద్యుత్ అందించినం, పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చూసాం, పండిన పంటను నిల్వ చేసుకునేందుకు 18 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించినం. మా నిర్ణయాలకు కేంద్ర బడ్జెట్ కొంత ఊతం ఇచ్చేలా ఉన్నా.. నిధులు కేటాయించడం లో నిబద్ధత పాటించాలి. అపుడే  అనుకున్నది సాధ్యం అవుతుంది. వైద్యం పేదవాడికి భారం కాకూడదనే ఆరోగ్య శ్రీ, CMRF, కేసీఆర్ కిట్స్ లాంటి వినూత్న పథకాలను తీసుకువచ్చినం. ఇప్పుడు కేంద్రం తెచ్చిన ఇన్సూరెన్స్ పథకం కి అరకొర నిధులు కాకుండా, సంపూర్ణంగా కేటాయించాలి. ప్రజల మధ్య అంతరాలు తగ్గించేందుకు ఎటువంటి చర్యలు లేవు.  మొత్తంగా ఈ బడ్జెట్లో తెలంగాణ అడిగిన ఏ రంగానికి నిధులు కేటాయించకపోవడం సరికాదు. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి అని ఆలోచించే రాష్ట్రాలకు ఈ కేటాయింపులు ఆశాజనకంగా లేవు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *