Breaking News

కేంద్ర బడ్జెట్లో కనీస మద్దతు ధర పెంపు ప్రకటన లేకపోవడం బాధాకరం: ఎంపీ కల్వకుంట్ల కవిత.

బడ్జెట్లో కనీస మద్దతు ధర పెంపు ప్రకటన లేకపోవడం బాధాకరం

న్యూడిల్లీ:

కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనీస మద్దతు ధర పెంపు ప్రకటన లేకపోవడం బాధాకరం అన్నారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత.
కనీస మద్దతు ధరలను 50% పెంచుతామని ఎన్నికల సమయంలో బిజెపి ఇచ్చిన హామీని ఆమె గుర్తు చేశారు. గత ఏడాది రబీ పంటలకు కేవలం పదిశాతం మాత్రమే msp పెంచి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
50 శాతంపైగా కనీస మద్దతు ధరలను పెంచి కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ఎం.పి కవిత డిమాండ్ చేశారు.
ఈ బడ్జెట్ పేదల పక్షాన ఉండి ఉంటే బాగుండేదన్నారు. లోక్‌సభలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఎంపీ కవిత మీడియా తో మాట్లాడారు. గ్రామీణ ప్రజల అభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయింపులు లేవని చెప్పారు. విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టామని చెప్పినా పెద్దగా కేటాయింపులు లేవన్నారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విషయంలో మొదటి నుంచీ ప్రభుత్వ వైఖరి విచిత్రంగా ఉందన్నారు. మహిళా శిశుసంక్షేమానికి సంబంధించి బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం బాధాకరమన్నారు. పెద్దపెద్ద కంపెనీలను వదిలి..మధ్య, చిన్న తరహా పరిశ్రమలపై ట్యాక్స్ వేయడం సరికాదన్నారు. ట్యాక్స్ వసూళ్లపై గతంలోనూ స్పందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీలో కూర్చొని గ్రామాల్లో పనిచేస్తోన్న ఉపాధి హామీ కూలీలకు అకౌంట్ లో డబ్బులు వేస్తామనడం సరైంది కాదు. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలు సీరియస్ గా తీసుకోవాలని అన్నారు. తెలంగాణ కు రైల్వే లైన్లు ఊసులేదన్నారు. రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం సరైంది కాదన్నారు ఎంపి కల్వకుంట్ల కవిత.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *