
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇవాళ కలిశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి వద్ద ఎయిర్పోర్టు ఏర్పాటుకై మరోసారి కేంద్రమంత్రికి ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు. ఎయిర్పోర్టు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర కమిటీని పంపాలని ఎంపీ కవిత కోరారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు సానుకూలంగా స్పందించారు.