కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల‌తో గృహ నిర్మాణ శాఖ స్పెష‌ల్ సీయ‌స్ చిత్రా రాంచంద్ర‌న్‌

 

రెండు ప‌డ‌క గ‌దుల ఇండ్ల నిర్మాణ ప‌థ‌కాన్ని ప్ర‌శంసించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు

రాష్ట్రంలో డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ నాణ్య‌త‌పై సంతృప్తి

ఇండ్ల నిర్మాణ ప్ర‌గ‌తిని ఎప్ప‌టిక‌ప్పుడు కంప్యూట‌రీక‌రించ‌డంపై ప్ర‌శంస‌

రేపు సూర్య‌పేట‌లోని డబుల్ బెడ్ రూం ఇండ్ల‌ను ప‌రిశీలించ‌నున్న కేంద్ర బృందం

తెలంగాణా ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల పథ‌కంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్ర‌శంస‌లు కురిపించింది. నాంప‌ల్లిలోని హౌసింగ్ బోర్డు కార్యాల‌యంలో గృహ నిర్మాణ శాఖ స్పెష‌ల్ సీయ‌స్ చిత్రా రాంచంద్ర‌న్‌తో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మోహిత్ వ‌ర్మ‌, ప్ర‌శాంత్ మిట్ట‌ల్‌, అజ‌య్ మోర్‌లు బేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణాలో చేప‌ట్టిన డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపై ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ద్వారా కేంద్ర బృందానికి వివ‌రించారు. దేశంలోనే ఎక్క‌డా లేని విధంగా ల‌బ్ధిదారునిపై ఒక్క రూపాయి భారం వేయ‌కుండా డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను అన్ని వ‌స‌తుల‌తో నిర్మించి ఇస్తున్న‌ట్లు తెలిపారు. 560 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంతో  గ్రామాల్లో రూ. 5 ల‌క్ష‌ల 4 వేల‌తో…ప‌ట్ట‌ణాల్లో రూ. 5 ల‌క్ష‌ల 30 వేల‌తో ఇండ్ల నిర్మాణం చేప‌డుతున్నామ‌న్నారు. అలాగే జీహెచ్ ఎంసీ ప‌రిధిలో జీ ప్ల‌స్ 3  యూనిట్‌కు రూ.7 ల‌క్ష‌లు, జీ ప్ల‌స్ 9 కు రూ. 7 ల‌క్ష‌ల 90 వేల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తున్నామ‌న్నారు. ఇండ్ల పురోగ‌తిని, చెల్లింపుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఆన్‌లైన్‌లో న‌మోదు చేస్తున్న‌ట్లు వివ‌రించారు. తెలంగాణాలో చేప‌డుతున్నరెండు ప‌డ‌క గ‌దుల ఇండ్ల నిర్మాణ ప‌థ‌కం ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా ఉంద‌ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్ర‌శంసించారు. ఇండ్ల నిర్మాణ వివ‌రాల‌ను కంప్యూట‌రీక‌రించ‌డంలో తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను అభినందించారు. ఇండ్ల నిర్మాణ నాణ్య‌త‌పై కూడా సంతృప్తి వ్య‌క్తం చేశారు. సూర్య‌పేట‌లోని డబుల్ బెడ్ రూం ఇండ్ల‌ను శుక్ర‌వారం కేంద్ర బృందం ప‌రిశీలించ‌నుంది. స‌మావేశంలో హౌసింగ్ కార్పొరేష‌న్ సీఈ స‌త్య‌మూర్తి, ఎస్ ఈలు మానిక్‌రెడ్డి, వెంక‌టేశ్వ‌ర్‌రెడ్డి, గంగారాం త‌దిత‌రులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *