కేంద్రం నుండి అధిక మొత్తంలో నిధులు సాధించేలా ప్రణాళిక సిద్ధం…

* పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో కేంద్ర పథకాల ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష
* సీఎస్ ఎస్పీ సింగ్, ఆర్ధిక శాఖ సెక్రటరీ రామకృష్ణారావుతో కేంద్ర నిధులపై చర్చించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
* వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి వస్తున్న నిధులు, ఖర్చు చేసిన మొత్తంపై అధికారులతో సమీక్ష
* కేంద్రం నుండి అధిక మొత్తంలో నిధులు సాధించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం
* మంత్రి జూపల్లి, కమిషనర్ నీతూ ప్రసాద్ తో పోస్ట్మాస్టర్ జనరల్ భేటీ
* అన్ని పోస్లాఫీస్ ల్లోను బయోమెట్రిక్, ఐరిష్ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి
* మంత్రి జూపల్లితో గూగుల్ ప్రతినిధుల భేటీ
* డిజిటల్ అక్షరాస్యత పై మహిళాసంఘాలకు అవగాహన కల్పించడంపై చర్చ
* ప్రాథమికంగా పది జిల్లాల్లో అవగాహన కార్యక్రమం చేపట్టేందుకు సంసిద్దత వ్యక్తం చేసిన గూగుల్ ప్రతినిధులు

హైదరాబాద్ : కేంద్రం నుండి ఎక్కువ నిధులను రాబట్టుకునేలా కార్యాచరణ సిద్దం చేయాలని పంచాయతీరాజ్ ,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధిశాఖలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలపై పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. కేంద్ర బడ్జేట్ లో జరిగిన కేటాయింపులకు అనుగుణంగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాక్రమాలకు రూపకల్పన చేయాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. కేంద్ర బడ్జేట్ లో జరిగిన కేటాయింపులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి, దానికి అనుగుణంగా కార్యక్రమాలకు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పటికప్పుడు ఉపాధిహామీ పనులను ఆన్ లైన్ లో పొందుపరచాలని, వారం రోజుల్లో ఉపాధిహామీ ఆన్లైన్ సర్వర్ను కూడా అప్డేట్ చేయాలని ఆదేశించారు. అలాగే అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లోను ఇంటర్నెట్ వేగాన్ని 8 ఎంబీపీఎస్ కు పెంచడంతో పాటు, అదనంగా 4జీ రూటర్ ను కూడా అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధిహామీ కింద టాయిలెట్లు నిర్మించేందుకు ప్రణాళిక సిద్దం చేయాలని ఆదేశించారు. తక్షణమే అన్ని జిల్లాలనుండి సీసీ రోడ్లకు ప్రతిపాదనలు సిద్దం చేయడంతో పాటు పనులు ప్రారంభించాలన్నారు. అనంతరం కేంద్ర పథకాలు, నిధుల వినియోగంపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఆర్ధికశాఖ కార్యదర్శి రామక్రిష్ణారావుతో మంత్రి జూపల్లి కృష్ణారావు,కమిషనర్ నీతూ ప్రసాద్ లు చర్చించారు.

మంత్రి జూపల్లి, కమిషనర్ నీతూ ప్రసాద్ తో పోస్ట్మాస్టర్ జనరల్ భేటీ
అన్ని పోస్లాఫీస్ ల్లోను బయోమెట్రిక్, ఐరిష్ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని పోస్ట్ మాస్టర్ జనరల్ ఎలీష ను మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ఆసరా పెన్షన్ల పంపిణీ తీరుపై పోస్ట్ మాస్టర్ జనరల్ తో మంత్రి చర్చించారు. బయోమెట్రిక్ ఇబ్బందులు ఉన్న పెన్షన్ దారులకు గ్రామ కార్యదర్శుల బయోమెట్రిక్ ద్వారా పెన్షన్ చెల్లించే విధానాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు.ఇందుకోసం పోస్లాఫీస్ ల్లో ఐరీష్ సౌకర్యం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోస్టాఫీస్ లు అందుబాటులో ఉన్న గ్రామాల్లో వాటి ద్వారానే పెన్షన్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇకపై ఆసరా పెన్షన్లను పూర్తి స్థాయిలో బయోమెట్రిక్, ఆసరా, ఆధార్ సీడింగ్ తోనే చేపట్టాలని, దీనిపై బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని కమీషనర్ నీతూ ప్రసాద్ ను ఆదేశించారు.

మంత్రి జూపల్లితో గూగుల్ ప్రతినిధుల భేటీ
గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలను పెంచే దిశగా మహిళసంఘాలకు డిజిటల్ అక్షరాస్యత కల్పించే దిశగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సిద్దం అవుతుంది. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, కమిషనర్ నీతూ ప్రసాద్ లతో గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. మహిళాసంఘాలకు డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పించే అంశంపై చర్చించారు.ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు గూగుల్ ప్రతినిధి సునీత వివరించారు. తెలంగాణలోను ప్రాథమికంగా పది జిల్లాల్లో అవగాహన కార్యక్రమం చేపట్టేందుకు సంసిద్దత వ్యక్తం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *