Breaking News

కేంద్రం నిధుల కోసం కేసీఆర్ వరుస మీటింగ్ లు

kcr-rajnathsingh

ఢిల్లీ, ప్రతినిధి : కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో వరుస మీటింగ్ లతో బిజీగా గడుపుతున్నారు. ఎయిమ్స్, ప్రాణహిత-చేవెళ్ల, దామరచర్ల విద్యుత్ కేంద్రం తదితర అంశాలపై , నియోజకవర్గ పునర్విభజనపై హెచ్.ఎస్. బ్రహ్మతోనూ ఆయన సమావేశమయ్యారు.

నల్గొండ జిల్లా బీబీనగర్ లో ఎయిమ్స్ కు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాను కోరారు. అనంతరం ఉక్కుమంత్రి తోమర్ తో మాట్లాడి బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు. తదనంతరం పర్యావరణ మంత్రి జవదేకర్ తో సమావేశమై వివిధ పరిశ్రమలకు ఫార్మాసిటీకి పర్యవరణ అనుమతులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. చివరకు సీఈసీ బ్రహ్మతో కలిసి నియోజకవర్గాల పునర్విభజనపై మాట్లాడారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *