
తెలంగాణ ఒత్తిడి ఆందోళన ఫలించింది.. తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ముప్పేట దాడిచేయడంతో ఫలితం వచ్చింది.. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని తెలంగాణ డబ్బులను అడగ్గకుండే 1200 కోట్లు తరలించుకుపోయిందని విమర్శించింది. దీంతో వెంకయ్య నాయుడు రంగంలోకి దిగి దిద్దుబాబు చర్యలు చేపట్టారు.
వెంటనే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి తెలంగాణ నుంచి తీసుకున్న 1200 కోట్ల నిధులను తిరిగి ఇచ్చేయాలని కోరారు. దీంతో వేగంగా స్పందించిన అరుణ్ జైట్లీ ఆర్తిక శాఖ సహాయ కార్యదర్శి ఆర్ బీఐని ఆదేశించారు. తెలంగాణ 1200 కోట్లను తిరిగి ఇచ్చేయాలని కోరారు. దీంతో తెలంగాణకు మళ్లీ ఆ 1200 కోట్లు తిరిగి వచ్చినట్టే..