కేంద్రం ‘ఉల్లి’ మిషన్

ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. మార్కెట్లో కిలో రూ.50 దాటింది. దేశంలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఉల్లిపాయల రేటు అమాంతం పెరిగింది. వ్యాపారులు కూడా బ్లాక్ చేసి ధర పెరగడానికి కారణమవుతున్నారు. దీంతో దేశంలో ఉల్లికి డిమాండ్ పెరిగి ధర రూ.50 దాటుతోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఉల్లి ధరల స్థిరీకరణ లో భాగంగా విదేశాలనుంచి పదివేల టన్నులను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ఇది త్వరలోనే భారత మార్కెట్లోకి వచ్చి ధరలు తగ్గనున్నాయి.

ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉల్లి ధరలపై సీరియస్ గా స్పందించింది. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. కలెక్టర్లతో మాట్లాడి ప్రతీ రైతుబజారులో కుటుంబానికి రెండు కిలోల ఉల్లిని రూ.20కే అందజేయాలని సూచించారు. బయటి మార్కెట్ నుంచి ఉల్లిని ప్రభుత్వం కొని రేషన్ కార్డులున్న పేదలకు రూ.20కే రైతు బజార్లలో అమ్మడానికి ప్లాన్ చేస్తోంది.. ఈనెల ఐదో తేదీ అంటే రేపటి నుంచే ఉల్లి ని రైతుల బజార్లలో అమ్ముతారు..

దీంతో పాటు ఉల్లిసాగును పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది.. ప్రస్తుతం తెలంగాణలో తక్కువగా ఉన్న ఉల్లి సాగు విస్తీర్ణాన్ని రెట్టింపు చేయాలని.. ఉల్లి విత్తనాలకు రైతులకు 75శాతం సబ్సిడీపై అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిద్వారా స్వంతంగా ఉల్లిని పండించి మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేయించి తెలంగాణలో ఉల్లి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది..

onian

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.