కెసిఆర్, హరీష్ రావు రూపంలో మనకు అదృష్టం వరించింది: మంత్రి తుమ్మల

కెసిఆర్, హరీష్ రావు రూపంలో మనకు అదృష్టం వరించింది: మంత్రి తుమ్మల

కేసీఆర్ సీఎం కావడం ప్రజల అదృష్టం. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి కావడం రైతుల అధృష్టం.

-మంత్రి తుమ్మల:

తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని పోరాడిన వ్యక్తి స్వర్గీయ రంగారెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కృష్ణానది పరివాహకం పై రంగారెడ్డి కి అపార అనుభవం ఉన్నదని చెప్పారు.కేసీఆర్ సీఎం కావడం ప్రజల అదృష్టమని, హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి కావడం రైతుల అధృష్టమని తుమ్మల వ్యాఖ్యానించారు. ప్రతీ ప్రాజెక్ట్ పనులను హరీశ్ రావు అహర్నిశలు పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు.మేడిగడ్డ పనుల వెనుక మంత్రి హరీష్ రావు కృషి ఉన్నదన్నారు. రెండు సంవత్సరాల్లో గోదావరి నీటితో ఖమ్మం జిల్లా ప్రజల కాళ్లు కడుగుతామని తుమ్మల తెలిపారు.సీతారామ ఎత్తిపోతల పథకం కు అనుమతులు రావడం వెనుక మంత్రి హరీష్ రావు కృషి అద్బతమని రోడ్లు, భవనాల మంత్రి అన్నారు.

సీతారామతో ఖమ్మం సస్యశ్యామలం:
-మంత్రి హరీశ్ రావు.

రెండేళ్లలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. కల్లూరు మండలం కొర్లగూడెం సభలో ఆయన మాట్లాడారు.కృష్ణా జలాలు వచ్చినా రాకున్నా గోదావరి నీటితో రెండు పంటలు సాగు చేసుకోవచ్చునని అన్నారు. సీతారామ మొదటి దశకు అనుమతులు సాధించామని, ఇదే ఉత్సాహంతో సీతారామ రెండో స్టేజ్ అనుమతులు సాధిస్తామన్నారు. కేంద్రం కోరినట్లు ఫారెస్ట్ అనుమతులకోసం 350 కోట్లు చెల్లించామని తెలిపారు.కాంగ్రెస్ నాయకులు చెబుతున్న రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ఖమ్మంకు న్యాయం చేయలేవని తెలిపారు. రాజీవ్ సాగర్ ప్రాజెక్టులో వైల్డ్ లైఫ్ ఫారెస్టు ఉందన్నారు. అనుమతులు రావాలంటే పదేళ్ల కాలం పడుతుందని చెప్పారు. ఇందిరా సాగర్ పథకానికి నీరు తీసుకునే మండలం ఆంధ్ర లో కలిసిపోయిందని మంత్రి చెప్పారు. రాజీవ్ సాగర్ ఇంద్ర సాగర్ను రీ డిజైన్ చేసి సీఎం కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు కు  ప్రాణం పోశారని హరీశ్ రావు తెలియజేశారు. గోదావరి నీళ్లతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. రెండు పంటలకు నీళ్లు పుష్కలంగా ఇస్తామని చెప్పారు. రెండు పంటలు పండించేందుకు రైతులు సిద్ధం కావాలన్నారు. తుమ్మల నిద్రపోడు, తమను నిద్రపోనివ్వడని హరీశ్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్, మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి సహకారంతో ఖమ్మం ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లాకు లిఫ్టులు, ఇతర ప్రాజెక్టుల తో పని లేదన్నారు. సీతారామ ప్రాజెక్టు అన్ని సమస్యలకు పరిష్కారమని ఇరిగేషన్  మంత్రి తెలిపారు. యాచవరపు రంగారెడ్డి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు గౌరవం, నమ్మకం అని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో రంగారెడ్డి ప్రముఖుడని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటుతోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని నమ్మిన వ్యక్తి రంగారెడ్డి అని హరీశ్ చెప్పారు.కృష్ణ నీటిలో తెలంగాణ వాటా కోసం ఆయన పోరాడారని మంత్రి తెలియజేశారు.

harish rao     harish rao 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *