కెసిఆర్ హయాంలో బిసిలకు మహర్దశ: మంత్రి హరీశ్ రావు

పేదలకు  చేతినిండా పని దొరికినప్పుడే బంగారు తెలంగాణ.

చింతమడకలో త్వరలో రెసిడెన్షియల్ స్కూలు.

కులవృత్తులకు పెద్దపీట.

బిసిలకు మహర్దశ.

సిద్ధిపేట మహిళా లైబ్రెరీకి సావిత్రి బాయి పూలే పేరు.

మొక్కజొన్న రైతులకు భరోసా.

– మంత్రి హరీశ్ రావు.

పేదలకు  చేతినిండా పని దొరికినప్పుడే బంగారు తెలంగాణ సార్ధకమవుతుందని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు.చింతమడక గ్రామంలో త్వరలో రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.తమ ప్రభుత్వం కులవృత్తులకు పెద్దపీట వేస్తున్నదని చెప్పారు.కెసిఆర్ హయాంలో బిసిలకు మహర్దశ వస్తున్నట్టు చెప్పారు.సిద్ధిపేట మహిళా లైబ్రెరీకి సావిత్రి బాయి పూలే పేరు పెడుతున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలియజేశారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో మహాత్మా జ్యోతిబా పూలే 192వ జయంతి ఉత్సవానికి హాజరైన మంత్రి హరీష్ రావు జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బడుగు, బలహీనవర్గాల దీన జన బంధు మహాత్మా జ్యోతిబా పూలే  జయంతి ఉత్సవాలలో బుధవారం నాడు హరీశ్ రావు పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను  అధికారికంగా జరపాలని సిఎం కెసిఆర్ ఆదేశించడంతో అన్ని జిల్లాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు.కుల వృత్తులకు  సిఎం కెసిఆర్ పెద్దపీట వేశారని గుర్తు చేశారు. బీసీల అభివృద్ధి,సంక్షేమమే కెసిఆర్ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇందుకోసం కెసిఆర్ భారీ   కార్యాచరణ ప్రణాలికను రూపొందిస్తున్నారని  మంత్రి తెలిపారు.దేశంలోనే తొలి మహిళా పాఠశాల స్థాపించిన ఘనత జ్యోతిబా పూలేకు దక్కిందన్నారు. 500 కు  పైగా గురుకుల పాఠశాలలను ప్రారంభించిన ఘనత దేశంలో ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందని మంత్రి హరీష్ రావు  చెప్పారు.119 బీసీ రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం గురుకుల పాఠశాలలను ప్రారంభించినట్టు  తెలిపారు. కేవలం సిద్దిపేట మండలంలో 5 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసుకున్నామని మంత్రి వివరించారు. త్వరలోనే చింతమడకలో మరో గురుకుల పాఠశాలలను ప్రారంభించబోతున్నట్లు మంత్రి వెల్లడించారు.సిద్దిపేట మండలంలోని రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల విద్య కోసం 30 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సిద్దిపేట మండలం ఎన్సాన్పల్లి గ్రామంలో ఎస్డీఎఫ్ నిధులు 7.65  లక్షలతో నిర్మించిన వివేకానంద రీడింగ్ భవనాన్ని  హరీష్ రావు ప్రారంభించారు. ఎన్సాన్పల్లి గ్రామంలో నాబార్డు గ్రామీణ సమీకృత అభివృద్ధి పథకం కింద   14 కోట్ల  50 లక్షల వ్యయంతో నిర్మించిన తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాలను  మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.ఒక్క మండలంలో ఆరు రెసిడెన్షియల్ పాఠశాలలు, ఒక్కో పాఠశాల నుంచి ఐదు వందల మంది విద్యార్థులు… మూడు వేల మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్టు చెప్పారు. నిజమైన బంగారు తెలంగాణ రాష్ట్రానికి ఇదే ఇదే నిదర్శనమని  మంత్రి అన్నారు. ఒక్క సిద్దిపేట మండలంలోని అయిదు రెసిడెన్షియల్ పాఠశాలలు. ఎన్సాన్పల్లి గ్రామంలో జనరల్ గురుకుల పాఠశాల, మిట్టపల్లి గ్రామంలో ఎస్సీ గురుకుల పాఠశాల, నారాయణరావు పేట గ్రామంలో బిసి రెసిడెన్షియల్ పాఠశాల, రాఘవాపూర్ గ్రామంలో కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల, ఇర్కోడ్ గ్రామంలో మోడల్ స్కూల్, ఈ ఐదు గురుకుల పాఠశాలలతో పాటు ఆరవ గురుకుల పాఠశాల చింతమడక గ్రామంలో ఏర్పాటు చేయడం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి చెప్పారు.పదవ తరగతిలో వందశాతం ఫలితాలు సాధించడంతో పాటు బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించాలని విద్యార్థులను కోరారు.సిద్దిపేట మండలం జాతీయ స్థాయిలో ఉత్తమ మండలంగా గుర్తింపు పొందిందని, ఇర్కోడు గ్రామం జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామంగా గుర్తింపు పొందడం గర్వకారణమని హరీశ్ రావు చెప్పారు. జాతీయ స్థాయిలో సిద్దిపేటకు పేరు ప్రతిష్టలు ఉన్నట్లుగానే విద్యార్థులు కూడా పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.ఎన్సాన్పల్లి గ్రామంలో 70  రూపాయలతో సిసి రోడ్లను నిర్మించినట్టు చెప్పారు.16 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేపట్టామని, అలాగే పొన్నాల వెంకటాపూర్ గ్రామాల మధ్య 1 కోటి 88 లక్షలతో రోడ్డు బ్రిడ్జి నిర్మాణ సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు.ఆర్థిక అసమానతలను రూపుమాపడం కేవలం విద్యతోనే సాధ్యమవుతుందని మంత్రి  హరీష్ రావు  అభిప్రాయపడ్డారు.1850వ సంవత్సరంలోనే మహిళల విద్యపై ఆలోచన చేసిన మహనీయుడు జ్యోతిబాపూలే అని ఆయన  కొనియాడారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీపై 4  వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడాన్ని    చూసి కర్ణాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత రేవన్ణ కొనియాడారని మంత్రి చెప్పారు.చేనేత కార్మికులకు అన్ని రకాల రుణాలను మాఫీ చేశామని, పైగా యాభై శాతం సబ్సిడీ అందిస్తూ చేనేత కార్మిక కుటుంబాలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని మంత్రి తెలిపారు.1050 వేల కోట్లతో గంగపుత్రులు, మత్స్యశాఖ అభివృద్ధికి పాటుపడుతోందని, చేప పిల్లల విత్తనాల నుంచి మొదలు మార్కెటింగ్ వరకు ఇందు కోసం ప్రభుత్వం  కృషి చేస్తున్నదని మంత్రి వివరించారు. 250 కోట్ల రూపాయలను నాయీ బ్రాహ్మణులకు వెచ్చించినట్లు పేర్కొన్నారు. సిద్దిపేటలో 1 కోటి 50 లక్షలతో అధునాతన మోడ్రన్ దోబీ ఘాట్ ను నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు.

HARISH RAO 1     HARISH RAO 2

దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతోందని , ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా 25 లక్షల రూపాయలను గ్రాంట్ రూపంలో విద్యార్థులకు అందజేస్తున్నామని మంత్రి వెల్లడించారు.సిద్దిపేట జిల్లా ఏర్పడక ముందే బిసి స్టడీ సర్కిల్  తెచ్చుకున్నామని, అన్ని రకాల ఉద్యోగాలకు ఇక్కడి నుంచే శిక్షణ అందించేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి వివరించారు .ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా సంచార జాతులకు 1000 కోట్ల బడ్జెట్టును పెట్టామని, ఈ ఏడు వారికి ఎనభై శాతం సబ్సిడీ ఇవ్వనున్నామని మంత్రి వెల్లడించారు.అన్ని వర్గాల వారికి కమ్యూనిటీ భవన నిర్మాణాల కోసం స్థలాలు నిధులు కేటాయించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి , షాదీముబారక్ పథకం ఒక వరంలా మారిందన్నారు.  కొత్తగా పెళ్లి చేసుకున్న పేదింటికి లక్ష 116 రూపాయలు ఇస్తున్నట్టు వివరించారు. బిసి వర్గాల్లోని నిరుపేదలను పైకి తేవడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త కార్యాచరణను రూపొందిస్తున్నారని మంత్రి హరీష్ చెప్పారు.జిల్లా కేంద్రమైన సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో రాష్ట్ర నిధులు 29 లక్షల నిధులతో  ఒకేషనల్ నూతన బ్లాక్‌ భవనాన్ని  మంత్రి హరీష్ రావు  ప్రారంభించారు.సిద్దిపేట పట్టణంలో వేసవి కాలం దృష్ట్యా శ్రీ పార్వతీ మాత యూత్ అసోసియేషన్  ఆధ్వర్యంలో నిర్వహించనున్న మజ్జిగ వితరణ ను ఆయన ప్రారంభించారు. స్వయంగా మంత్రి స్థానికులకు మజ్జిగ ను అందజేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని హరీష్ రావు రైతులను కోరారు. మార్కెట్లో 1200 నుంచి 1250 వరకు ధర ఉన్నదని,  కానీ ప్రభుత్వం 1425 రూపాయలకు మద్దతు ధర చెల్లింపులు చేస్తున్నదని తెలిపారు. ఈ సదవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని మంత్రి కోరారు. మార్కెట్ ధర ప్రకారం రైతులు  2 వందల రూపాయల వరకు నష్టపోతున్నట్లు రైతుల నుంచి విజ్ఞపతులు అందాయని ,  వారి శ్రేయస్సును కోసం  ప్రభుత్వమే 1425 రూపాయల మద్దతు ధరను అందిస్తున్నదని మార్కెటింగ్ మంత్రి హరీష్ చెప్పారు.సిద్దిపేట జిల్లాలో 6 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు , సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, చేర్యాల, దుబ్బాక, కోహెడల లొ ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు .తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ప్రతి పంటకు మద్దతు ధర అందిస్తామని మంత్రి వెల్లడించారు .సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో హరీష్ రావు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

HARISH RAO 3     HARISH RAO 4

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *