
రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై ప్రప్రధమంగా కరీంనగర్ జెడ్పీ సర్వసభ సమావేశానికి విచ్చేసిన మాజీ మంత్రి రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీ కాంతారావును ఆదివారం నాడు కరీంనగర్ లో ఘన సన్మానం చేశారు. రాష్ట్ర్ర ఆర్ధిక శాఖా మంత్రి ఈటెల రాజేందర్ చేతుల మీదుగా జెడ్పీ ఛైర్మన్ తుల ఉమ ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడిదల సతీష్ బాబు, ఎమ్.ఎల్సీలు నారాదాసు లక్ష్మణరావు,
సుధాకర్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ, కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, సిరిసిల్లా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెడ్పీటీసి సభ్యులు, విప్పనపల్లి సాంబయ్య, శరత్ రావు, సిద్దం వేణు, నారా బ్రహ్మయ్య, కరీంనగర్ మండల పరిషత్ అధ్యక్షులు వాసాల రమేష్, గంగాధర మండల పరిషత్ అధ్యక్షులు దూలం బాల గౌడ్, డి.సి.ఎం.ఎస్ ఛైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, చొప్పదండి మండల పరిషత్ అధ్యక్షులు గుఱ్ఱం భూమిరెడ్డి, రామగుండం జెడ్పీటీసి సభ్యురాలు సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.