కెనడావోళ్లు నిర్మిస్తున్న ‘రామ‌స‌క్క‌ని రాకుమారుడు’

కెన‌డా ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ నిర్మించిన తొలి తెలుగు చిత్రం  రామ‌స‌క్క‌ని రాకుమారుడు..
నూత‌న న‌టీన‌టులు ఉద‌య్, స‌ప్న జంట‌గా ఉద‌య్ క‌ల్లూరి తెర‌కెక్కించిన చిత్రం రామ‌స‌క్క‌ని రాకుమారుడు. కెన‌డా బేస్డ్ ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. కెన‌డా బ్యాక్ డ్రాప్ లో కెన‌డా బేస్ట్ ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ నిర్మించిన తొలి తెలుగు చిత్రం రామ‌స‌క్క‌ని రాకుమారుడు కావ‌డం విశేషం. యువ సంగీత ద‌ర్శ‌కుడు హేమ చంద్ర ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. మధుర ఆడియో ద్వారా డిసెంబ‌ర్ 5న కెన‌డాలోని టోరోన్టో లో ఆడియో రిలీజ్ చేయ‌నున్నారు. ఇటీవ‌ల రామ‌స‌క్క‌ని రాకుమారుడు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ మ‌రియు టీజ‌ర్ రిలీజ్ చేసారు. ఈ టీజ‌ర్కి అద్భుత‌మైన స్పంద‌న ల‌భిస్తోంది.
rama3
ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ ఉద‌య్ క‌ల్లూరి మాట్లాడుతూ…సామాజిక, సాంస్కృతిక తేడాల‌ వ‌ల‌న‌  పిల్ల‌లు, త‌ల్లిదండ్రులు రిలేష‌న్ షిప్ పై ఎలాంటి ప్ర‌భావం చూపిస్తాయ‌నే సందేశంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాను. కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా…ఇలా ప్రేక్ష‌కులు కో్రుకునే అన్ని అంశాల‌తో పాటు ఎన్.ఆర్.ఐ ప్రేక్ష‌కుల‌కు చ‌క్క‌ని సందేశం కూడా ఉంది. 150 నిమిషాల నిడివి గ‌ల ఈ సినిమాలో మూడు పాట‌లు ఉన్నాయి. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. నిర్మాత హారిక క‌ల్లూరి ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా జ‌గ‌న్నాథ‌న్, ఎడిటింగ్ ర‌మేష్ సెల్వ‌రాజా.
rama4rama2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *