కృష్ణ పట్నంపై చంద్రబాబుకు కేసీఆర్ జలక్..

హైదరాబాద్ : గత ఏడాది తెలంగాణలో విద్యుత్ కొరత తీవ్రమైనప్పుడు చంద్రబాబు కృష్ణపట్నం విద్యుత్ ను తెలంగాణకు ఇవ్వకుండా అడ్డుపడ్డారు. ప్రయోగాత్మక ఆ తర్వాత వాణిజ్య ఉత్పత్తిలో కూడా తెలంగాణకు రావాల్సిన వాటా విద్యుత్ ఏపీ సీఎం ఇవ్వలేదు.

అప్పుడు తెలంగాణలో కటకట.. కానీ ఇప్పుడు తెలంగాణలో కరెంటు సరఫరా బాగుంది. తెలంగాణ తీవ్ర కొరత ఉన్నప్పుడు ఏపీ సీఎం వ్యూహాత్మకంగా కరెంటు ఇవ్వక కేసీఆర్ ను దెబ్బకొట్టారు. ఇప్పుడు అదే కృష్ణపట్నం కరెంటును తీసుకోకుండా కేసీఆర్ ధీటైన సమాధానం ఇచ్చారు.

కృష్ణ పట్నంలో ప్రస్తుతం 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి భారీగా ఖర్చయింది. ఉత్పత్తి ఖర్చుకూడా పెరిగింది.దీంతో ఇప్పుడు కరెంటును భారీ రేటుకు అమ్ముతోంది. ఈ కరెంటును కొంటే తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక భారం. దీంతో చాలా చీప్ గా దొరికే కరెంటు అందుబాటులో ఉండడంతో కృష్ణపట్నం విద్యుత్ ను తెలంగాణలో తీసుకోలేదు. ఇది ఏపీ ప్రభుత్వానికి, కృష్ణపట్నం విద్యుత్ కేంద్ర నిర్వాహకులకు తలకుమించిన భారమవుతోంది.

ఇలా అవకాశం ఉన్నప్పుడు ఇబ్బందిపెట్టిన చంద్రబాబుకు .. అదే కేసీఆర్ అవకాశం కొద్ది దెబ్బకొట్టారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *