
కృష్ణా జిల్లా నందిగామ మండలం గొల్లమూడలో గతరాత్రి కురిసిన వర్షంలో చేపలు పడ్డాయి. తెల్లవారేసరికి పొలాలకు వెళ్లిన రైతులు చేపలను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. గ్రామంలో ఎక్కడ వాగులు , వంకలు లేవని.. ఓపెన్ గా ఉన్న పొలాల్లో రాత్రి భారీ వర్షం కురిసిందని.. వర్షంతో పాటే చేపలు పడ్డాయని రైతులు తెలిపారు.
తెల్లవారి పొలాలకు వెళ్లిన రైతులకు పొలాల్లో కొన్ని చనిపోయన చేపలు, మరికొన్ని బతికున్న చేపలు కనిపించాయి. వీటిని రైతులు తమ ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ వింతను చూడడానికి జనం పోటెత్తారు.