
కృష్ణ జలాల వినియోగంపై కేంద్రం మధ్యవర్తిత్వం నెరిపింది. బచావత్ తీర్పుల ప్రకారం ఏపీ తెలంగాణకు కృష్ణ జలాలను తాత్కాలికంగా పంపిణీ చేసింది. తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు వినియోగించుకునేలా ఒప్పించింది. ఈ కేటాయించిన నీటిని ఎక్కడినుంచైనా వినియోగించుకునే స్వేచ్ఛను రాష్ట్రాలకు ఇచ్చింది. నీటి నిర్వహణ, విడుదలపై బోర్డు పర్యవేక్షిస్తుంది. ఒకవేళ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత పెరిగినా నిష్పత్తి మారదు. మిగులు జలాలపై కేంద్రం తరువాత నిర్ణయం తీసుకుంటుంది.