కృష్ణా జలాల పంపిణీకి పట్టుబట్టిన తెలంగాణ

29 9:512 నిష్పత్తిలో కృష్ణా జలాల పంపిణీకి పట్టుబట్టిన తెలంగాణ.

నిరాకరించిన ఆంధ్రప్రదేశ్ .

నీటి పంపిణీ నిష్పత్తి తేలనంత వరకు బోర్డు వర్కింగ్ మాన్యువల్ ను ఒప్పుకోబోమన్న టి.ఎస్.

రెండు రాష్ట్రాల కృష్ణా నీటి వాడకంపై వర్కింగ్ ఎరేంజ్మెంటు వుండాలన్న టి.ఎస్.

తిరస్కరించిన ఎపి .

————–

శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు న్యాయంగా రావలసిన నీటి వాటాపై కూడా ఆంధ్రప్రదేశ్ అన్యాయంగా వ్యవహరిస్తుందంటూ మండిపడ్డ తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసిందేనా అని ప్రశ్నించిన తెలంగాణ.

ఇంకా ఎంతకాలం ఈ దగా అని ఎపి ని కెఆర్ఎంబి సమావేశంలో నిలదీసిన తెలంగాణ.

నదీజలాల పంపిణీ, కేటాయింపులు, నీటి వాడకం వంటి విషయాలలో అంతర్జాతీయంగా అమలులో వున్న నియమాలను ఎపి పాటించడం లేదని వాదించిన తెలంగాణ .

ప్రాజెక్టు వారీగా కేటాయింపులు లేనందున తెలంగాణను తీవ్ర అన్యాయం జరుగుతోందని వాదించిన టి.ఎస్. కేటాయింపులలో స్పష్టత లేకపోతే తెలంగాణ వాటా దక్కదన్న టి.ఎస్. ఉమ్మడి ప్రాజెక్టుల నీటి పంపిణీ ఏ నిష్పత్తిలో జరగాలన్న అంశంపై సమావేశంలో చర్చించారు. ఇందుకుగాను బచావత్స ట్రిబ్యునల్ ఒప్పుకున్న 811 టిఎంసిల ప్రకారం 299: 512 నిష్పత్తిలో నీటి పంపిణీ జరగాలని తెలంగాణ కెఆర్ఎంబి ని కోరింది. ఈ ప్రతిపాదనను ఎపి తిరస్కరించింది. ఏ నివృత్తిలో నీటిని విడుదల చేయాలో తేల్చకుండా బోర్డు వర్కింగ్ మాన్యువల్‌ ను ఒప్పుకోమని టి.ఎస్. తేల్చి చెప్పింది. సమావేశంలో కెఆర్ఎంబి వర్కింగ్ మాన్యువల్ ఖరారుపై వేడివేడిగా చర్చ జరిగింది.ఎపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల కేటాయింపులపై చర్చించిన కెఆర్ఎంబి ప్రత్యేక సమావేశం. నాగార్జునసాగర్ నుంచి కుడికాలువకు 6000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు నిర్ణయం .

5 టిఎంసీల నీటిని విడుదల చేయాలన్న ఎపి కోర్కె ను అంగీకరించిన టి.ఎస్.

కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతాంగం కోసం 5 టీఎంసీలు విడుదల చేయాలని జారీ చేసిన ఉత్తర్వులు అమలు కాలేదంటూ ఎపి వాదనను ఖండించిన తెలంగాణ.

ఎపి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశామని రుజువు చూపిన టి.ఎస్.

ఎపి వాదన సత్యదూరమని ఆధారాలు చూపిన టి.ఎస్. ఎట్టకేలకు ‘ కెనాల్ క్లియరెన్స్’ సర్టిఫికేట్ ను కెఆర్ఎంబి సమావేశంలో టి. ఎస్. కు అందించిన ఎపి చీఫ్ ఇంజనీర్ . కెఆర్ఎంబి ఉత్తర్వులను టిఎస్ ఖాతరు చేయడం లేదంటూ ఎపి వితండ వాదం.

సమర్ధంగా తిప్పిగొట్టిన టి.ఎస్. బుధవారం నుంచే 6వేల క్యూసెక్కుల చొప్పున విడుదల . నీటి ‘ట్రాన్సిట్’ నష్టాలకు తమ బాధ్యత లేదన్న టి.ఎస్. సమావేశానికి అధ్యక్షత వహించిన బోర్డు ఛైర్మన్ హల్దార్. సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ, మెంబర్ (పవర్ ) బాలన్, టి.ఎస్. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎస్కే.జోషి, ఎపి ఇరిగేషన్ కార్యదర్శి శశిభూషణ్ రావు, టి.ఎస్. ఇ.ఎన్.సి. మురళీధరరావు , ఎపి ఇఎన్సి వెంకటేశ్వరరావు ఇతర సి.ఇలు , అంతర్రాష్ట్ర జల విభాగం అధికారులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *