
సీనియర్ నటుడు కృష్ణంరాజు పరిస్థితి విషమించింది.. ఆయన గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. కృష్ణంరాజుకు ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
కాగా విషయం తెలియగానే ప్రభాస్ కృష్ణంరాజు వద్దకు వచ్చి రెండు గంటల పాటు ఆయన వద్ద ఉన్నారు. కృష్ణంరాజు, ఆయన తమ్ముడి ప్యామిలీలు రెండూ ఆస్పత్రిలోనే ఉన్నారు. కృష్ణంరాజు పరిస్థితి కొంత నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.