Breaking News

కూల్ కూల్ ధోని సీరియస్ అయితే ఎలా ఉంటుందో తెలుసా..

hqdefault

ఎప్పుడూ మైదానంలో.. బయట కూల్ కూల్ గా ఉండే ధోని సీరియస్ అయిన సందర్భాలు చాలా తక్కువ.. ఎంతో సంయమనంతో పనులు చక్కదిద్దే ధోనిని మిస్టర్ కూల్ అంటుంటారు. అలాంటి ధోని బంగ్లాదేశ్ తో మ్యాచ్ అనంతరం ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆగ్రహించారు.  అసహనానికి గురయ్యారు. విలేకరిపై ఒకింత ఆగ్రహంగా బదులిచ్చారు.

‘విలేకరుల సమావేశం మొదలవగానే ఓ విలేకరి ధోనిని అడుగుతూ ‘బంగ్లాదేశ్ పై సులభంగా గెలిచి నెట్ రన్ రేట్  బాగా మెరుగుపరుచుకుంటారనుకుంటారని ఆశించాం.. మరి ఈ విజయంతో మీరూ సంతృప్తి చెందారా..?’ అని ప్రశ్నించారు.

దీనిపై ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన ధోని ‘మీ ప్రశ్న.. దాన్ని అడిగిన తీరు చూస్తే ఈ విజయం పట్ల మీరు సంతోషంగా లేనట్లు స్పష్టంగా తెలుస్తోంది. టాస్ ఓడిపోయి.. కఠినమైన పిచ్ మీద బ్యాటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు బయట కూర్చున్న మీరు  పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచానా వేయాలి. అలా అంచనా వేయనప్పుడు ఈ ప్రశ్న వేయకూడదు’ ఒకింత సీరియస్ గా అన్నారు.

ఎన్నడూ సీరియస్ కానీ ధోని ఓ విలేకరిపై ఆగ్రహించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై ఇంటి బయటా ఒకటే చర్చ మొదలైంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *