Breaking News

కూలీలందరికీ చేతినిండా పని కల్పిస్తాం

కరీంనగర్ (పిఎఫ్ ప్రతినధి): జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా కూలీలందరికీ చేతినిండా పని కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి హామీలో కూలీలకు జీవనోపాధి పనులే కాక జీవన ప్రమాణాలు పెంచే పనులు కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలోని కూలీలు పనులకు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రతి గ్రామంలో కూలీలకు అవసరమైన ఉపాధి హామీ పనులు కల్పించ వలసిందిగా క్షేత్ర స్థాయి సిబ్బందికి గట్టి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఉపాధి హామీ పనుల కల్పనలో ఏమైన ఇబ్బందులు ఉన్నట్లయితే 0878-2233142 నంబరుకు సంప్రదించాలని తెలిపారు. జిల్లాలో జూన్ మాసం నుంచి హరిత హారం క్రింద మొక్కలు నాటడం నర్సరీలు పెంచడంలో రోజు సరాసరి 20 వేల మంది కూలీలు ఉపాధి పొందారని తెలిపారు. ఇవే కాకుండా ఉపాధి హామీ పథకంలో చేపట్టబడిన నీటి సంరక్షణ, చెరువుల పునరుద్దీకరణ, సాంప్రదాయ నీటి వనరుల సంరక్షణ, పండ్ల తోటల పెంపకం, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, స్మశాణ వాటికల అభివృద్ధి మొదలగు పనుల ద్వారా గ్రామాలలోని కూలీలకు ఉపాధి పనులు కల్పిస్తున్నట్లు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *