
కువైట్ లో భారత రాయబారిగా నియమితులైన కె.జీవసాగర్ మంగళవారం నాడు రాష్ట్ర హోం మరియు కార్మిక శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసారు. తెలంగాణ సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో కలిసిన సందర్బంగా మంత్రి నాయిని నరసింహారెడ్డి ఈ అంశాలు ప్రస్తావించారు… కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారు పెద్ద మొత్తంలో ఇండియన్ నర్సుల రిక్రూట్ మెంట్ చేసుకుంటున్నారు. గవర్నమెంట్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ అయిన “తెలంగాణ ఓవర్సీస్ మాన్ పవర్ కంపెనీ (టాం కాం)” గురించి తెలిసే విదంగా చర్యలు తీసుకుంటే మన అభ్యర్థులకు మంచి పనివాతావరణంలో పనిచేసే అవకాశం రావడమే కాకుండా మంచి జీతాలు (నెలకు దాదాపు ఎనబై వేల రూపాయలు ) పొందుతారు. ఇతర గల్ఫ్ దేశాలతో పోలిస్తే ఇక్కడ సెలక్షన్ విదానం చాలా సులభంగా ఉంటుంది. కావున ఈ రిక్రూట్మెంట్లు ప్రభుత్వ ఏజెన్సీలు అయిన టాం కాం ద్వారా జరిగే విదంగాసహాయపడండి. ఇంగ్లీష్ బాషలో టాం కాం బ్రోచర్స్ (కర పత్రాలు) కువైట్ ఇండియన్ ఎంబసీకు పంపుతాం. ప్రభుత్వ రిక్రూట్ మెంట్ ఎజెన్సీ అయిన టాం కాం గురించి అవగాహన మరియు ప్రచారం కొరకు సాద్యమైనంత సహాయం చేయండి.
నిర్మాణ రంగం, గ్యాస్ మరియు పెట్రోలియం రంగం , హెల్త్ వంటి రంగాలలో అక్కడ విస్తృత అవకాశాలు వున్నాయి. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా రిక్రూట్ మెంట్ చేసుకుంటే లీగల్ మైగ్రేషన్ జరుగుతుంది. కావున ఈ రంగాలలో సైతం టాం కాం ద్వారా రిక్రూట్ మెంట్ జరిగే విదంగా సహాయపడండి. కువైట్ ,సౌదీఅరేబియా, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్ మరియు బహ్రెయిన్ (మొత్తం 6 దేశాలు ) లను కలిపి “గల్ఫ్ కో- ఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్” అంటారు. కువైట్ లో ఎనిమిది లక్షలకు పైగా బారతీయులు నివసిస్తున్నారు. ఎక్కువమంది బారతీయులు నిర్మాణ రంగం,టెక్నీషియన్స్ , ఇంజనీర్స్, డాక్టర్స్, నర్సులు, చార్టెడ్ అకౌంటెంట్స్, ఐ.టి. నిపుణులుగా పనిచేస్తున్నారు. కువైట్ లో ఇండియన్ నర్సులకు మంచి డిమాండ్ ఉంది.
ఈ కార్యక్రమంలో కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి శశాంక్ గోయల్, టాం కాం చైర్మన్ పి.రంగారెడ్డి, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ డిపార్టుమెంటు డైరెక్టర్ కె.వై.నాయక్, టాం కాం జనరల్ మేనేజర్ నాగబారతి పాల్గొన్నారు.